శ్రీహరి తనయుడు రెండో సినిమా ఫిక్స్ : దర్శకుడు ఎవరంటే
'శతమానం భవతి' సినిమాతో నేషనల్ జాతీయ అవార్డు అందుకున్న డైరెక్టర్ సతీష్ వేగేశ్న ఇప్పుడు ఒక యూత్ ఫుల్ ఎంటర్టైన్ మెంట్ చిత్రం తెరకెక్కించబోతున్నారు.
‘శతమానం భవతి’ సినిమాతో నేషనల్ జాతీయ అవార్డు అందుకున్న డైరెక్టర్ సతీష్ వేగేశ్న ఇప్పుడు ఒక యూత్ ఫుల్ ఎంటర్టైన్ మెంట్ చిత్రం తెరకెక్కించబోతున్నారు. ఇద్దరు హీరోలుగా ఈ సినిమాను రూపొందించనున్నారు. అందులో ఒకరు దివంగత నటుడు డా.శ్రీహరి తనయుడు మేఘామ్ష్ శ్రీహరి కాగా, మరొకరు వేగేశ్న సతీష్ తనయుడు సమీర్ వేగేశ్న. ఈ సినిమాను ‘లక్ష్య ప్రొడక్షన్స్’ బ్యానర్ పై ఎమ్.ఎల్.వి సత్యనారాయణ (సత్తిబాబు) నిర్మించనున్నారు. నేడు దివంగత శ్రీహరి గారి జయంతి సందర్భంగా ఈ సినిమాను అనౌన్స్ చేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు సతీష్ మాట్లాడుతూ “వరుసగా ఫ్యామిలీ ఓరియంటెడ్ చేసాను. ఇప్పుడు ఓ మంచి పూర్తి స్థాయి వినోదభరితమైన చిత్రం చేయబోతున్నాను. ప్రస్తుతానికి ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అయ్యింది. అన్ని పరిస్థితులు చక్కబడిన వెంటనే షూటింగ్ స్టార్ట్ చేస్తాం” అని తెలిపారు.
నిర్మాత ఎమ్.ఎల్.వి సత్యనారాయణ (సత్తిబాబు) మాట్లాడుతూ ” సతీష్ గారు తీసిన ‘శతమానం భవతి’ సినిమా నా మనసుకి బాగా నచ్చింది. ఇప్పుడు ఆయనతో మూవీ చేయడం సంతోషంగా ఉంది. హీరోయిన్స్, ఇతర సాంకేతికనిపుణుల వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం” అని వివరించారు.
Also Read : కరోనా టీకాపై ప్రధాని మోదీ స్పష్టత