‘కార్గిల్ గర్ల్’ మేకర్లు క్షమాపణలు చెప్పాల్సిందే
శ్రీదేవీ తనయు జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గుంజన్ సక్సేనా: ద కార్గిల్ గర్ల్. మాజీ ఐఏఎఫ్ పైలట్ గుంజన్ సక్సేనా జీవిత కధ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం
The Kargil Girl controversy: శ్రీదేవీ తనయు జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గుంజన్ సక్సేనా: ద కార్గిల్ గర్ల్. మాజీ ఐఏఎఫ్ పైలట్ గుంజన్ సక్సేనా జీవిత కధ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 12న ఓటీటీలో విడుదల అయ్యింది. కాగా ఇందులోని కొన్ని సన్నివేశాలపై భారత వైమానిక దళం అభ్యంతరం వ్యక్తం చేసింది. ముఖ్యంగా సినిమాలో లింగ పక్షపాతం గురించి చూపడంపై ఐఏఎఫ్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దీంతో వివాదం మొదలైంది. మరోవైపు ఈ వివాదంపై స్పందించిన జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రేఖా శర్మ.. కార్గిల్ గర్ల్ మేకర్లు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ మేరకు ట్వీట్ చేసిన రేఖా శర్మ.. ”సినిమాలో చూపిన విధంగా లింగ పక్షపాతం ఉందో లేదో నిజమైన గుంజన్ సంక్సేనా వచ్చి స్పష్టతను ఇవ్వాలి. ఆర్మీ కుటుంబం నుంచి వచ్చిన దానికి నాకు కొంత తెలుసు. డిఫెన్స్ అధికారులు గూండాలుగా ప్రవర్తించరని నాకు తెలుసు. త్రివిధ దళాల్లో మహిళలకు కచ్చితంగా గౌరవం ఉంటుంది” అని ట్వీట్ చేశారు.
ఆ తరువాత ఈ విషయంపై గుంజన్ సక్సేనా క్లారిటీ ఇచ్చింది అని తెలుసుకున్న రేఖా శర్మ మరో ట్వీట్ చేశారు. ”గుంజన్ సక్సేనా స్పష్టతను ఇచ్చింది కాబట్టి, మేకర్లు కచ్చితంగా క్షమాపణలు చెప్పాలి. అలాగే ఆ సన్నివేశాలను తీసేయాలి. నిజాలు కానప్పుడు మన అధికారుల గురించి తప్పుగా చూపడం ఎందుకు” అని రేఖా శర్మ ప్రశ్నించారు. కాగా శరన్ శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్, ఎస్సెల్ విజన్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించారు.
Read More:
సుశాంత్ కుటుంబానికి న్యాయం జరగాలి: నిర్భయ తల్లి
నా సర్వస్వం నువ్వే.. ఐ లవ్ యు: మిహీక
https://twitter.com/sharmarekha/status/1293940432934588417?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1293940432934588417%7Ctwgr%5E&ref_url=https%3A%2F%2Fd-4273852658759286572.ampproject.net%2F2007302351001%2Fframe.html
https://twitter.com/sharmarekha/status/1293959115031506945?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1293959115031506945%7Ctwgr%5E&ref_url=https%3A%2F%2Fd-4273852658759286572.ampproject.net%2F2007302351001%2Fframe.html