ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితిపై తాజా హెల్త్ బులిటెన్
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితిపై ఎంజీఎం ఆసుపత్రి తాజాగా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితిపై ఎంజీఎం ఆసుపత్రి తాజాగా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలిపింది. ఇంకా ఐసీయూలోనే లైఫ్ సపోర్ట్ సిస్టమ్ మీదే చికిత్స కొనసాగుతోందని వెల్లడించింది.
కాగా ఎస్పీబీ తనయుడు చరణ్ కూడా తన తండ్రి ఆరోగ్యం గురించి స్పందించారు. వెంటిలేటర్‌పై ఉంచడం ఆయనకు ఎంతో ఉపయోగపడిందని తెలిపారు. ప్రస్తుతం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నెమ్మదిగా కోలుకుంటున్నారని, ఆయన ఆరోగ్యం మెరుగుపడటంపై డాక్లర్లు కూడా సంతోషం వ్యక్తం చేశారని వివరించారు.
కోవిడ్ స్వల్ప లక్షణాలతో ఎస్పీబీ ఆగస్టు 5న ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. అప్పుడు తన ఆరోగ్యం చాలా బాగుందని, ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని సెల్పీ వీడియో రిలీజ్ చేశారు. అయితే గురువారం రాత్రి ఆయన ఆరోగ్య పరిస్థితి అనూహ్యంగా విషమించడంతో ఐసీయూకి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రత్యేక డాక్టర్స్ టీమ్ ఆయన ఆరోగ్య పరిస్థితి ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంది. కాగా తాజాగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం భార్య సావిత్రి కూడా కరోనా బారిన పడ్డారు. దీంతో ఆమెను కూడా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీంతో ఎస్పీబీ దంపతులు త్వరగా కోలుకోవాలని దేశవ్యాప్తంగా ప్రముఖులు, సాధారణ ప్రజలు కోరుకుంటున్నారు.
Also Read : కరోనా టీకాపై ప్రధాని మోదీ స్పష్టత