నాకు కష్టపడడంలోనే ఆనందం ఉంది.. ‘మన శంకవరప్రసాద్ గారు’ సక్సెస్ మీట్ లో మెగాస్టార్ చిరంజీవి
మన శంకరవరప్రసాద్ గారు సక్సెస్ మీట్ ఆదివారం (జనవరి 25) అట్టహాసంగా జరిగింది. హైదరాబాద్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు, విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి తో పాటు మన శంకరవరప్రసాద్ చిత్ర బృందమంతా హాజరైంది.

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ సినిమా ‘మన శంకర వరప్రసాద్‌గారు’. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పటికే రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. అంతేకాదు బుక్ మై షోలో రికార్డు స్థాయిలో టిక్కెట్లు అమ్ముడయ్యాయి. ఈ నేపథ్యంలో సినిమా విజయాన్ని పురస్కరించుకుని ఆదివారం (జనవరి 25) సాయంత్రం మన శంకరవరప్రసాద్ గారు సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. మన శంకరవరప్రసాద్ గారు ఆల్ టైమ్ హిట్ సెలబ్రేషన్స్ పేరిట నిర్వహించిన ఈ కార్యక్రమానికి దర్శకేంద్రుడు రాఘ వేంద్రరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ తో పాటు శంకరవరప్రసాద్ చిత్ర బృందమంతా ఈ వేడుకలో సందడి చేసింది. ఈ సందర్భంగా మాట్లాడిన చిరంజీవి తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘అమ్మ అన్నం సినిమా సక్సెస్ ఎప్పుడు బోర్ కొట్టదు. వింటేజ్ చిరంజీవి తో పాటు ఆ వింటేజ్ షీల్డ్ లు ఈ సినిమా ద్వారా మళ్లీ చూడటం ఆనందగా ఉంది. మగపిల్లలయినా , ఆడపిల్లలయినా చిత్ర పరిశ్రమ లోకి వస్తాం అంటే ఎంకరేజ్ చేయాలి. సినిమా ఇండస్ట్రీ లో కాస్టింగ్ కౌచ్ లేదు. ఇండస్ట్రీ అద్దం లాంటిది.. మనం ఎలా బిహేవ్ చెస్తామో రిజల్ట్ కూడా అలానే ఉంటుంది. ఇక్కడ ఎవరి వర్కింగ్ స్టయిల్ వారిది. కొందరు ఔట్ డోర్ యూనిట్ బిల్లులు ఎక్కువగా వెస్తున్నారు. ఈ సినిమాను మాత్రం 85 రోజుల్లో అనుకున్న బడ్జెట్ లో చేయగలిగాం. సంక్రాంతికి అన్ని సినిమాలు విజయవంతం అవటం సంతోషం. ఈ సినిమా సక్సెస్ అనంతరం కొందరు చెప్పిన మాటలు నన్ను ఎమోషనల్ ఫీలింగ్ కలిగించాయి. ఈ వయస్సులో కూడా ఎందుకు కష్టం అంటున్నారు. నాకు కష్ట పడటంలోనే ఆనందం.. అందుకు తగ్గ ఉత్సాహం అభిమానుల శ్రేయోబిలాషుల ప్రశంసల నుంచే లభిస్తుంది’ అని చెప్పుకొచ్చారు.
మన శంకవరప్రసాద్ గారు సక్సెస్ మీట్ లో చిరంజీవి ఫుల్ స్పీచ్ కోసం ఈ వీడియో చూడండి..
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..




