Megastar Chiranjeevi: భారతదేశ కల నెరవేరింది.. ఆర్ఆర్ఆర్ టీంకు మెగాస్టార్ అభినందనలు..
భారత్ ఎప్పటికీ ఒక కల అని భావించేది.. కానీ ఓ వ్యక్తి విజన్, ధైర్యం, పట్టుదలతోనే ఇది సాకారమైంది. ఇప్పుడు కోట్ల మంది భారతీయుల హృదయాలు గర్వంతో ఉప్పొంగిపోతున్నాయి.

95వ అకాడమీ అవార్డ్స్ వేడుకలలో నాటు నాటు పాటకు ఆస్కార్ రావడం భారతీయులందరికీ ఇది ఎంతో గర్వకారణమన్నారు మెగాస్టార్ చిరంజీవి. మూవీ టీమ్‌కు అభినందనలు తెలిపారు. ప్రపంచ వేదికపై తెలుగు సినిమా కీర్తిని వెలుగెత్తి చాటారన్నారు. విశ్వవేదికపై ఆర్ఆర్ఆర్ చిత్రం సత్తా చాటింది. ప్రపంచస్థాయిలో తెలుగు సినిమా స్థాయిని నిరూపించింది. ఆస్కార్ వేడుకలలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నామినేట్ అయిన నాటు నాటు పాట ఆస్కార్ కైవసం చేసుకుంది. ఈ సందర్బంగా చిత్రయూనిట్ కు అభినందలు తెలిపారు చిరు.
“భారత్ ఎప్పటికీ ఒక కల అని భావించేది.. కానీ ఓ వ్యక్తి విజన్, ధైర్యం, పట్టుదలతోనే ఇది సాకారమైంది. ఇప్పుడు కోట్ల మంది భారతీయుల హృదయాలు గర్వంతో ఉప్పొంగిపోతున్నాయి. ఆర్ఆర్ఆర్ బృందంలోని ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా ” అంటూ ట్వీట్ చేశారు చిరు.




భారత సినిమా ఆస్కార్ కల నెరవేరింది. ప్రపంచ వేదికపై తెలుగు సినిమా చరిత్ర సృష్టించింది. దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన RRRమూవీ ఆస్కార్ వేదికపై సత్తా చాటింది. 95వ ఆస్కార్ అవార్డుల వేడుకలో.. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు పాటకు ప్రతిష్టాత్మక అవార్డ్ దక్కించుకుంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ కు సినీ , రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
#Oscars would have still been a dream for India but for One Man’s vision, courage & conviction @ssrajamouli ! ????
A Billion ?? Hearts filled with Pride & Gratitude ! Kudos to every member of the Brilliant Team of @RRRMovie@DVVmovies #Oscars95
— Chiranjeevi Konidela (@KChiruTweets) March 13, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.