Natu song:ఆస్కార్ వేదికపై నాటు నాటు స్టెప్పులు.. అతిరథ మహారథుల స్టాండింగ్ ఒవేషన్..
ప్రతీ ఒక్క భారతీయుడు గర్వంతో ఉప్పొంగే సమయం వచ్చేసింది. మరీ ముఖ్యంగా తెలుగు వారి మీసం మెలేసే రోజు రానే వచ్చేసింది. అంతర్జాతీయ ప్రతిష్టాత్మకంగా అవార్డు ఆస్కార్ నాటు నాటు సాంగ్‌ను వరించింది...

ప్రతీ ఒక్క భారతీయుడు గర్వంతో ఉప్పొంగే సమయం వచ్చేసింది. మరీ ముఖ్యంగా తెలుగు వారి మీసం మెలేసే రోజు రానే వచ్చేసింది. అంతర్జాతీయ ప్రతిష్టాత్మకంగా అవార్డు ఆస్కార్ నాటు నాటు సాంగ్‌ను వరించింది. లాస్ ఏంజిల్స్‌లో జరిగిన ఆస్కార్ వేడుకల్లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌కు గాను నాటు నాటుకు అవార్డు దక్కింది. వరల్డ్ వైడ్‌గా 81 పాటలు ఆస్కార్‌కు ఎంట్రీ ఇవ్వగా.. తుది జాబితాలో ఐదు పాటలు ఆస్కార్‌కు షార్ట్ లిస్ట్ అయ్యాయి. నాటు నాటు తో పాటు టెల్ ఇట్ లైక్ ఏ ఉమెన్(అప్లాజ్), హోల్డ్ మై హ్యాండ్ (టాప్‌గన్:మావెరిక్), లిఫ్ట్ మీ అప్(బ్లాక్ పాంథర్), దిస్ ఈజ్ లైఫ్(ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్) పాటలు ఆస్కార్‌కు పోటీ పడగా.. నాటు నాటుకు అవార్డు దక్కింది.
ఇదిలా ఉంటే అవార్డు ప్రకటను ముందు ఆస్కార్ వేదికపై నాటు సాంగ్‌కు విదేశీ డ్యాన్సర్లు కాలు కదిపారు. కాగా ప్రపంచ సినీతారల చప్పట్ల నడుమ ఆస్కార్ వేదికపై నాటు నాటు పాట సందడి చేసింది. రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవల ఆస్కార్ వేదికపై నాటు నాటు పాటను లైవ్‌లో పాడారు. వాళ్ల గోంతుకు ఆమెరికన్ నటులు కాలు కదిపారు. పాట పాడటం పూర్తికాగానే ఆడియెన్స్ స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చారు. ప్రపంచ సినిమాకు చెందిన అతిరథ మహారథుల చప్పట్లతో డాల్బీ థియేటర్ మారుమోగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
Naatu Naatu from #RRR being performed at the #Oscars pic.twitter.com/Urn4fvUj6Y
— LetsCinema (@letscinema) March 13, 2023
Watch the live #Oscars performance of #RRR‘s “Naatu Naatu” from inside the Dolby Theatre, along with director S. S. Rajamouli pic.twitter.com/EQ9aLz0c0y
— The Hollywood Reporter (@THR) March 13, 2023
Here’s the energetic performance of “Naatu Naatu” from #RRR at the #Oscars. https://t.co/ndiKiHeOT5 pic.twitter.com/Lf2nP826c4
— Variety (@Variety) March 13, 2023
Standing ovation for #NaatuNaatu Performance at the #Oscars95 ❤️?❤️?❤️????????? #RRRMovie pic.twitter.com/kDwMNfnLM8
— RRR Movie (@RRRMovie) March 13, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..