Megastar Chiranjeevi: ‘దసరా’ చిత్రయూనిట్ పై చిరంజీవి ప్రశంసలు.. ఆ విషయం తెలిసి ఆశ్చర్యపోయానంటూ ట్వీట్..

|

Apr 13, 2023 | 12:34 PM

ఓవైపు థియేటర్లలో ఈ మూవీ సత్తా చాటుతుండగా.. మరోవైపు సోషల్ మీడియాలో ఈ సినిమా సాంగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. డైరెక్టర్ శ్రీకాంత్ టేకింగ్.. నాని.. కీర్తి నటనపై సినీ విమర్శకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా దసరా చిత్రంపై రివ్యూ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి.

Megastar Chiranjeevi: దసరా చిత్రయూనిట్ పై చిరంజీవి ప్రశంసలు.. ఆ విషయం తెలిసి ఆశ్చర్యపోయానంటూ ట్వీట్..
Megastar Chiranjeevi, Nani
Follow us on

దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్నారు న్యాచురల్ స్టార్ నాని. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‏గా వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాదు.. విడుదలైన పది రోజుల్లోనే రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇప్పటి వరకు నాని కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అయిన సినిమా ఇదే కావడం విశేషం. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల రూపొందించిన ఈ సక్సెస్ ఫుల్ మూవీలో కీర్తి సురేష్ కథానాయికగా నటించగా.. కన్నడ యంగ్ హీరో దీక్షిత్ శెట్టి, సముద్రఖని, సాయి కుమార్ కీలకపాత్రలలో నటించారు. ఈ సినిమాలో ధరణిగా నాని.. వెన్నెలగా కీర్తి నటన అద్భుతమనే చెప్పాలి. పూర్తిగా తెలంగాణ యాసలో వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఓవైపు థియేటర్లలో ఈ మూవీ సత్తా చాటుతుండగా.. మరోవైపు సోషల్ మీడియాలో ఈ సినిమా సాంగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. డైరెక్టర్ శ్రీకాంత్ టేకింగ్.. నాని.. కీర్తి నటనపై సినీ విమర్శకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా దసరా చిత్రంపై రివ్యూ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి.

తాజాగా దసరా సినిమా చూసిన చిరు… డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల మేకింగ్ బాగుందని.. ఇక నాని, కీర్తి, దీక్షిత్ నటన సూపర్ అంటూ కితాబిచ్చారు. “డియర్ నాని.. దసరా సినిమా చూశాను. చాలా గొప్ప సినిమా ఇది. నీ నటన చాలా అద్భుతంగా ఉంది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల పనితీరు చాలా బాగుంది. అసలు ఇది శ్రీకాంత్ ఓదెలకు తొలి సినిమా అని తెలిసి ఆశ్చర్యపోయాను. చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. మా మాహానటి కీర్తి సురేష్ యాక్టింగ్ అదిరిపోయింది. దీక్షిత్ శెట్టి కూడా తన పాత్రకు న్యాయం చేశాడు. సంతోష్ నారాయణన్ సంగీతం అదిరిపోయింది. మొత్తంగా టీమంతా కలిసి గొప్ప చిత్రాన్ని ఇచ్చారు” అని చిరంజీవి మెచ్చుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.