AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Megastar Chiranjeevi: వాళ్లది శాడిజం.. పైశాచికానందం.. హీరో సుమన్ ఇష్యూపై స్పందించిన చిరంజీవి..

వాల్తేరు వీరయ్య చిత్ర ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్న చిరు.. ఎన్నో ఏళ్లుగా తన పై వచ్చిన ఆరోపణలపై క్లారిటీ ఇచ్చారు. వ్యక్తిగత విషయాలే కాకుండా.. రాజకీయాలు.. మొగల్తూరు ఇంటి అమ్మకం.. విష ప్రయోగం ఇలా ఒక్కటేమిటీ కొన్నేళ్లుగా ప్రజల మనసులలో నిలిచిపోయిన అనేక సందేహాలను పటాపంచలు చేశారు.

Megastar Chiranjeevi: వాళ్లది శాడిజం.. పైశాచికానందం.. హీరో సుమన్ ఇష్యూపై స్పందించిన చిరంజీవి..
Megastar Chiranjeevi, Suman
Rajitha Chanti
|

Updated on: Jan 12, 2023 | 5:24 PM

Share

మెగాస్టార్ చిరంజీవి.. డైరెక్టర్ బాబీ కాంబినేషన్లో రాబోతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ వాల్తేరు వీరయ్య. ఈ మూవీ కోసం సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో చిరు సరసన శ్రుతి హాసన్ నటిస్తుండగా.. కీలకపాత్రలో మాస్ మాహారాజా రవితేజ కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ మూవీపై అంచనాలను పెంచేసింది.. అలాగే మరోవైపు ఈ చిత్రంలోని పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. సంక్రాంతి కానుకగా ఈ మూవీ జనవరి 13న గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఈ క్రమంలోనే వాల్తేరు వీరయ్య చిత్ర ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్న చిరు.. ఎన్నో ఏళ్లుగా తన పై వచ్చిన ఆరోపణలపై క్లారిటీ ఇచ్చారు. వ్యక్తిగత విషయాలే కాకుండా.. రాజకీయాలు.. మొగల్తూరు ఇంటి అమ్మకం.. విష ప్రయోగం ఇలా ఒక్కటేమిటీ కొన్నేళ్లుగా ప్రజల మనసులలో నిలిచిపోయిన అనేక సందేహాలను పటాపంచలు చేశారు. అలాగే హీరో సుమన్ జైలు పాలు కావడానికి చిరంజీవే కారణం అంటూ పుకార్లు వినిపించాయి. దీనిపై కూడ వివరణ ఇచ్చారు చిరు.

ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరు ఈ ఇష్యూపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆరోజుల్లో సుమన్ జైలు పాలయినప్పుడు మీరే కారణమని వార్తలు వచ్చాయి అని అడగ్గా.. ఛీ.. ఛీ.. దానికి ఆన్సర్ ఇవ్వడం కూడా ఇబ్బందిగా ఉంది. నేను సుమన్ మంచి స్నేహితులం. మధ్యలో ఎవడో పోరంబోకు ఏదో రాశాడు. పోరంబోకు అనే మాట చాలా హార్ష్ గా ఉండొచ్చు. కానీ వాడు ఏదో రాశాడా.. ఆ రాసిన దాన్ని వక్రీకరించాడో కానీ ఇప్పటికీ వందలసార్లు సుమన్ ఏం లేదని చెప్పాడు. ఆయనకు నాకు ఎలాంటి విరోదం లేదు. ఇప్పటికీ మేం మాట్లాడుకుంటుంటాం. సుమన్ నేను 80వ దశకం బ్యాచ్ రీ యూనియన్ లో కలుస్తాం. మాట్లాడుకుంటాం. కానీ వీళ్లు మాత్రం శాడిస్టులా మాట్లాడుతుంటారు.

పదే పదే విమర్శలు చేస్తుంటారు. ఇలాంటి వాటిపై మాట్లాడుకోవడం సిగ్గు చేటు. ఏ తప్పు చేయని వాడిపై ఆరోపణలు చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారు. నా నుంచి ఎవరు ఏ తప్పు పట్టలేరు. ఇలాంటివి సాగదీస్తూ వెళ్లినా నాకు ఎలాంటి ఇబ్బంది లేదు” అంటూ ఘాటుగా స్పందించారు. అలాగే తనపై విష ప్రయోగం జరగలేదని.. అది వశీకరణ పౌడర్ కలిపి ఓ అభిమాని తనకు కేక్ ఇచ్చాడని క్లారిటీ ఇచ్చారు చిరు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..