
భోళా శంకర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. అయితే ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయారు. కుర్ర హీరోలకు పోటీగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర సినిమాలో నటిస్తున్నారు. బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీలో హీరోయిన్‌గా త్రిష నటిస్తోంది. సోషియో ఫాంటసీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు చిరంజీవి. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ మెగా మూవీలో లేడీ సూపర్ స్టార్ నయన తార హీరోయిన్ గా నటిస్తోంది. వీటి తర్వాత బాబీ తో మెగాస్టార్ మరో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. గతంలో వీరి కాంబోలో వచ్చిన వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించి అధికారిక ప్రకటన రావొచ్చునని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ బాబీకి ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చి సర్‌ప్రైజ్ చేశాడు. సుమారు 6- 10 లక్షల పైగా విలువ చేసే ఒమేగా సీమాస్టర్ వాచ్ ని బాబీకి గిఫ్ట్ గా అందించాడు చిరంజీవి. ఈ విషయాన్ని డైరెక్టరే స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ‘చిరంజీవి గారి నుంచి నాకు మెగా సర్‌ప్రైజ్ వచ్చింది. ఈ బహుమతికి నేను అస్సలు వెలకట్టలేను. థాంక్యూ అన్నయ్యా! ఈ స్పెషల్ గిఫ్ట్‌ను నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను’ అని చిరంజీవిపై తనకున్న ప్రేమకు అక్షర రూపమిచ్చాడు బాబీ. ఈ సందర్భంగా తన చేతికి మెగాస్టార్ ఖరీదైన వాచ్ తొడుగుతోన్న ఫొటోలను కూడా షేర్ చేశాడు డైరెక్టర్. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక అది చూసిన వారంతా ‘మెగాస్టార్ కు ఒకసారి నచ్చితే చాలు.. జీవితాంతం గుండెల్లో పెట్టుకుంటారు’, ‘వాచ్ అదిరిపోయింది’ అని క్రేజీ కామెంట్లు చేస్తున్నారు.
A beautiful MEGA surprise from the Boss himself 🤩
Thank you dearest Megastar @KChiruTweets garu for this priceless gift 💝
Your love, encouragement, and blessings mean the world to me annaya 🙏 I’ll cherish this moment forever 🤗 pic.twitter.com/pkCXi3SozH
— Bobby (@dirbobby) May 22, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.