కుర్ర హీరోయిన్స్‌కు గట్టి పోటీ ఇస్తున్న త్రిష.. నాలుగు పదుల వయసులోనూ ఏం అందం గురూ..!
సౌత్ ఇండస్ట్రీలో తోపు హీరోయిన్. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా అందం, అభినయంతో సినీ పరిశ్రమను ఏలేస్తోంది. తెలుగుతోపాటు తమిళం, మలయాళం భాషలలో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటూ ఇప్పటికీ టాప్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. ఇటీవలే పొన్నియిన్ సెల్వన్, లియో వంటి హిట్స్ తర్వాత త్రిష క్రేజ్ మరింత పెరిగింది.

Trisha Photo
- సౌత్ ఇండస్ట్రీలో తోపు హీరోయిన్. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా అందం, అభినయంతో సినీ పరిశ్రమను ఏలేస్తోంది. తెలుగుతోపాటు తమిళం, మలయాళం భాషలలో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటూ ఇప్పటికీ టాప్ హీరోయిన్ గా దూసుకుపోతుంది.
- ఇటీవలే పొన్నియిన్ సెల్వన్, లియో వంటి హిట్స్ తర్వాత త్రిష క్రేజ్ మరింత పెరిగింది. ఇప్పుడు అజిత్ సరసన విడాముయార్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రాలతో మరిన్ని హిట్స్ ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతుంది.
- ‘జోడి’ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన తర్వాత మౌనం పెసియాదే మూవీతో హీరోయిన్గా గుర్తింపు పొందింది. తక్కువ సమయంలోనే పాన్ ఇండియా లెవల్లో తనదైన ముద్ర వేసింది. ఇప్పుడు దక్షిణ భారతదేశంలో అత్యంత డిమాండ్ ఉన్న నటిగా, అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్ గా మారింది.
- ప్రస్తుతం త్రిష కమల్ హాసన్ సరసన థగ్ లైఫ్ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాకు మణిరత్నం దర్శకత్వం వహిస్తున్నారు. 42 ఏళ్ల వయసులోనూ ఈ ముద్దుగుమ్మ కుర్ర హీరోయిన్స్ కు గట్టిపోటీ ఇస్తుంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.
- రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. తాజాగా త్రిష చీరకట్టులో అదిరిపోయే ఫోటోలను పంచుకుంది. ఈ ఫోటోలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు. ఈ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.









