AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Megastar Chiranjeevi-Ram Charan: తండ్రిగా ఎంతో గర్వంచేలా చేస్తుంది. చరణ్‏కు డాక్టరేట్ పై చిరంజీవి ఎమోషనల్ పోస్ట్..

ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (SICTE) అధ్యక్షుడు డీజీ సీతారాం చేతుల మీదుగా చరణ్ డాక్టరేట్ అందుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోస్, ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. సీనిరంగంలో చెర్రీ చేసిన సేవలకు ఫలితంగా ఈ డాక్టరేట్ ప్రదానం చేసినట్లు వెల్స్ యూనివర్సిటీ పేర్కొంది. చెర్రీకి డాక్టరేట్ రావడంపై సినీ ప్రముఖులు, సన్నిహితులు శుభాకాంక్షలు నెట్టింట శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈక్రమంలోనే చెర్రీకి డాక్టరేట్ రావడం పై ఎమోషల్ పోస్ట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి.

Megastar Chiranjeevi-Ram Charan: తండ్రిగా ఎంతో గర్వంచేలా చేస్తుంది. చరణ్‏కు డాక్టరేట్ పై చిరంజీవి ఎమోషనల్ పోస్ట్..
Ram Charan, Chiranjeevi
Rajitha Chanti
|

Updated on: Apr 14, 2024 | 6:56 AM

Share

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్..ఇకపై డాక్టర్ రామ్ చరణ్. ఆయనకు చెన్నైలోని వేల్స్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసిన సంగతి తెలిసిందే. నిన్న (ఏప్రిల్ 13న) యూనివర్సిటీలో జరిగిన స్నాతకోత్సవంలో రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మిగతా పరిశోధక విద్యార్థులతో కలిసి డాక్టరేట్ అందుకున్నారు. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (SICTE) అధ్యక్షుడు డీజీ సీతారాం చేతుల మీదుగా చరణ్ డాక్టరేట్ అందుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోస్, ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. సీనిరంగంలో చెర్రీ చేసిన సేవలకు ఫలితంగా ఈ డాక్టరేట్ ప్రదానం చేసినట్లు వెల్స్ యూనివర్సిటీ పేర్కొంది. చెర్రీకి డాక్టరేట్ రావడంపై సినీ ప్రముఖులు, సన్నిహితులు శుభాకాంక్షలు నెట్టింట శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈక్రమంలోనే చెర్రీకి డాక్టరేట్ రావడం పై ఎమోషల్ పోస్ట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఈ క్షణం తండ్రిగా తనను గర్వించేలా చేస్తుందంటూ ట్వీట్ చేశారు.

“తమిళనాడులోని ప్రముఖ వేల్స్ యూనివర్శిటీ రామ్ చరణ్‏కు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేయడం ఎప్పటికీ ఒక తండ్రిగా నన్ను ఎమోషనల్‏గా, గర్వించేలా చేస్తుంది. ఇది ఒక ఉత్తేజకరమైన క్షణం. మన సంతానం వారి విజయాలతో మనల్ని అధిగమించినప్పుడే ఏ తల్లిదండ్రులకైనా నిజమైన ఆనందం. రామ్ చరణ్ చాలా స్థిరత్వంతో చేస్తున్నాడు.. రాబోయే రోజుల్లో మరింత ముందుకు, పైకి ఎదగాలి. లవ్ యు మై డియర్ డా.రామ్ చరణ్!” అంటూ ట్వీట్ చేశారు. చిరు చేసిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది.

డైనమిక్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన చిరుత సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశాడు చరణ్. ఫస్ట్ మూవీ నిరాశ పరిచినా ఆ తర్వాత ప్రతి సినిమాలోనూ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. రెండో సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. మగధీర, రచ్చ, నాయక్, రంగస్థలం, ఆర్ఆర్ఆర్, ధృవ వంటి హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. జక్కన్న డైరెక్షన్లో చరణ్ నటించిన ట్రిపుల్ ఆర్ మూవీతో వరల్డ్ వైడ్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.