AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiranjeevi: నా ఆత్మీయ మిత్రుడి మరణం దిగ్భ్రాంతి కలిగించింది.. నటుడు జీవీ నారాయణకు మెగాస్టార్ చిరంజీవి నివాళి

ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత జీవీ నారాయణ రావు (73) కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బుధవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. దీంతో పలువురు ప్రముఖులు ఈ టాలీవుడ్ నటుడి మృతికి నివాళులు అర్పిస్తున్నారు.

Chiranjeevi: నా ఆత్మీయ మిత్రుడి మరణం దిగ్భ్రాంతి కలిగించింది.. నటుడు జీవీ నారాయణకు మెగాస్టార్ చిరంజీవి నివాళి
Chiranjeevi, GV Narayana Rao
Basha Shek
|

Updated on: Aug 27, 2026 | 8:39 PM

Share

టాలీవుడ్ ప్రముఖ నటుడు, నిర్మాత జీవీ నారాయణ రావు మరణం పట్ల ఆయన మిత్రుడు, హీరో చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టారు మెగాస్టార్. జీవీ నారాయణ రావుతో కలిసున్న ఫొటోను షేర్ చేస్తూ.. ‘ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత, నా ఆత్మీయ మిత్రుడు జీవీ నారాయణరావు గారు ఇక లేరనే వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. 1976లో ‘అంతులేని కథ’ చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఆయన, ఎన్నో చిత్రాల్లోనూ, పలు టెలివిజన్‌ సీరియళ్లలోనూ తన విలక్షణమైన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. నారాయణరావు గారితో నాకు ఎంతో సన్నిహితమైన అనుబంధం ఉంది. ‘దేవాంతకుడు’, ‘యముడికి మొగుడు’ వంటి చిత్రాలను నాతో నిర్మించిన నిర్మాతగా మా ప్రయాణంలో ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఓం శాంతి ‘ అని చిరంజీవి రాసుకొచ్చారు.

జీవీ నారాయణ రావు విషయానికి వస్తే.. కృష్ణా జిల్లా, కురుమద్దాలి ఆయన స్వగ్రామం. మద్రాస్ ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ తీసుకున్న ఆయన రజనీకాంత్, చిరంజీవిలకు మంచి మిత్రుడే. 1976 లో వచ్చిన అంతులేని కథ సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయ్యారు నారాయణ రావు. దాదాపు 100కు సినిమాలలో నటించారు. ముత్యాల పల్లకి’, ‘అంగడి బొమ్మ’, ‘చిలకమ్మ చెప్పింది’, ‘గ్యాంగ్ లీడర్’, హిట్లర్ తదితర సినిమాలు నారాయణ రావుకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. కేవలం నటుడిగానే కాకుండా దేవాంతకుడు, ఇంటికో రుద్రమ్మ, యముడికి మొగుడు, పెళ్ళి నీకు శుభం నాకు వంటి సినిమాలను కూడా నిర్మించారీ సీనియర్ నటుడు. నారాయణరావుకు ఒక కుమారుడు, కుమార్తె. ప్రస్తుతం ఇద్దరూ విదేశాల్లో ఉంటున్నారు. వీరు రేపు ఉదయం కల్లా హైదరాబాద్ కు చేరుకోనున్నారు. ఆ తర్వాతే నారాయణ రావు అంత్యక్రియలు జరగనున్నాయి.

ఇవి కూడా చదవండి

చిరంజీవి ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us