Chiranjeevi : ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తున్న మెగాస్టార్ న్యూ లుక్.. మరీ ఇంత యంగ్‌గా మారిపోయావేంటి బాసు..
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలను లైనప్ చేసి ఆయా సినిమాల షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నారు. త్వరలోనే కొరటాల శివ దర్శకత్వం వహించిన ఆచార్య సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురనున్నారు.
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi ) ప్రస్తుతం వరుస సినిమాలను లైనప్ చేసి ఆయా సినిమాల షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నారు. త్వరలోనే కొరటాల శివ దర్శకత్వం వహించిన ఆచార్య సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురనున్నారు. ఈ సినిమాలో చిరు తోపాటు మెగపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో చిరు చరణ్ ఇద్దరూ నక్సలైట్స్ గా కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమ నుంచి విడుదలైన పాటలు, టీజర్ సినిమా పై అంచనాలను పెంచేశాయి. ఇక ఇటీవలే చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకోవడంతో ఆచర్య సినిమాపై ఆటోమేటిక్ గా హైప్ క్రియేట్ అయ్యింది. ఈ సినీయ తర్వాత మెగాస్టార్ తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసీఫర్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాకు గాడ్ ఫాదర్ అనే టైటిల్ ను ఖరారు చేశరు. అలాగే మెహర్ రమేష్ డైరెక్షన్ లో వేదళం రీమేక్ భోళశంకర్ సినిమాలో నటిస్తున్నారు చిరు. ఈ సినిమా తర్వాత బాబీ దర్శకత్వంలో ఓ మాస్ మసాలా సినిమా చేయనున్నారు చిరు. ఈ సినిమాకు వాల్తేరు వీరన్న అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఇప్పుడు మెగాస్టార్ ను పుష్ప డైరెక్టర్ సుకుమార్ డైరెక్ట్ చేయడానికి రెడీ అయ్యారు. కానీ ఈ కాంబినేషన్ లో వచ్చేది సినిమా కాదు.. ఓ యాడ్ షూటింగ్ కోసం ఈ ఇద్దరు చేతులు కలిపారు. ఇటీవలే పుష్ప సినిమాతో పాన్ ఇండియన్ డైరెక్టర్స్ లిస్ట్ లోకి చేరిపోయారు సుకుమార్. తాజాగా మెగాస్టార్ తో ఓ యాడ్ ను షూట్ చేస్తున్నారు సుకుమార్. తాజాగా దీనికి సంబంధించిన ఫోటోలను మెగాస్టార్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. దర్శకుడిగా సుకుమార్ ప్రతిభ అందరికి తెలిసిందే. ఓ యాడ్ ఫిల్మ్ కోసం వారి దర్శకత్వంలో నటించాను. షూటింగ్ ని చాలా ఎంజాయ్ చేశాను` అని రాసుకొచ్చారు చిరు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ ఫొటోలో మెగాస్టార్ మరింత యంగ్ గా కనిపిస్తున్నారు. ఫార్మల్ డ్రస్ లో చిరు లుక్ ప్రేక్షకులను ఫిదా చేస్తుంది. త్వరలోనే ఈ కాంబినేషన్ లో సినిమా వస్తే బాగుండు అనుకుంటున్నారు మెగా ఫ్యాన్స్.మరి మెగా ఫ్యాన్స్ కోరిక నెరేవేరుతుందేమో చూడాలి.
దర్శకుడుగా సుకుమార్ ప్రతిభ అందరికి తెలిసిందే. ఓ ad film కోసం, వారి దర్శకత్వం లో షూటింగ్ నేను చాలా enjoy చేశాను.ఈ యాడ్ నిర్మించిన శుభగృహ రియల్ ఎస్టేట్ వారికి శుభాభినందనలు. pic.twitter.com/3iZmcyLmvy
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 1, 2022
మరిన్ని ఇక్కడ చదవండి :