Acharya: ఆచార్య వచ్చేది అప్పుడే.. రిలీజ్ డేట్ ప్రకటించిన చిత్రయూనిట్..

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న చిత్రం ఆచార్య. ఇందులో కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. .

Acharya: ఆచార్య వచ్చేది అప్పుడే.. రిలీజ్ డేట్ ప్రకటించిన చిత్రయూనిట్..
Acharya


మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న చిత్రం ఆచార్య. ఇందులో కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. . యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‏టైన్మెంట్ బ్యానర్లపై నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. అలాగే ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, పూజా హెగ్డే కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. దీంతో ఈ సినిమా ఎప్పుడుడెప్పుడు చూద్దామా అని మెగా అభిమానులతో పాటు ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

ఇదిలా ఉంటే…. ఈసినిమా విడుదల తేదీపై గత కొద్ది రోజులుగా నెట్టింట్లో పలు రకాల వార్తలు వస్తున్నాయి. ఆచార్య రిలీజ్ మారిందని.. ఆర్ఆర్ఆర్ సినిమా ఎఫెక్ట్ చిరు సినిమాపై పడిందని.. డిసెంబర్ 17న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ఇలా పలు రకాల రూమర్స్ నెట్టింట్లో చక్కర్లు కొట్టాయి. ఈ క్రమంలో తాజాగా రూమర్స్ కు చెక్ పెట్టింది చిత్రయూనిట్. ఆచార్య విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. మెగాస్టార్ చిరంజీవి, కాజల్ అగర్వాల్ జంటగా ఆచార్య సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లుగా చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ సందర్భంగా.. ఆచార్య నుంచి చిరు న్యూలుక్ ఫోటోను రివీల్ చేశారు మేకర్స్. అందులో చిరు ఆలయం నుంచి ఆగ్రహంతో బయటకు వస్తు కనిపిస్తున్నాడు. ఇదిలా ఉంటే మెగాస్టార్ మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. ఈ సినిమా తర్వాత  మెహర్ రమేష్-బాబిలతో సినిమాలుచేయనున్నారు మెగాస్టార్.

Also Read: Salman Khan: పాపం.. సల్మాన్ ఖాన్ కష్టాలు మాములుగా లేవు.. మాణికె మాగే హితె సాంగ్ కోసం ఎన్ని తంటాలు పడ్డాడో చూడండి..

RRR Movie: ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ కోసం భారీ ప్లాన్.. ప్రచారంలో కొత్త పుంతలు తొక్కిస్తున్న జక్కన్న..

Click on your DTH Provider to Add TV9 Telugu