Salman Khan: పాపం.. సల్మాన్ ఖాన్ కష్టాలు మాములుగా లేవు.. మాణికె మాగే హితె సాంగ్ కోసం ఎన్ని తంటాలు పడ్డాడో చూడండి..
మాణికే మాగే హితే.. ఇప్పుడు సోషల్ మీడియాలో మొత్తం ఎక్కడ చూసిన ఇదే పాట. నిజానికి ఈ పాటకు అర్థం ఎవ్వరికి తెలీదు.
మాణికే మాగే హితే.. ఇప్పుడు సోషల్ మీడియాలో మొత్తం ఎక్కడ చూసిన ఇదే పాట. నిజానికి ఈ పాటకు అర్థం ఎవ్వరికి తెలీదు. అయినా నెట్టింట్లో రికార్డ్స్ సృష్టిస్తూ దూసుకుపోతుంది. అందుకే అంటారు సంగీతానికి భాషతో సంబంధం లేదు అని. మ్యూజిక్ నచ్చితే.. భాషతో సంబంధం లేకుండా పట్టం కట్టేస్తారు. ట్యూన్.. మ్యూజిక్.. అందుకు తగిన వాయిస్ ఉండాలనే గానీ.. రాత్రికి రాత్రే మిలియన్ వ్యూస్ వచ్చేస్తాయి. చిన్న , పెద్దా పాటను ఇష్టపడుతుంటారు. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో కొన్ని సాంగ్స్ ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి. అందులో మరీ ముఖ్యంగా బుల్లెట్టు బండి సాంగ్.. ఆ తర్వాత మాణికే హితే సాంగ్. బుల్లెట్టు బండి.. తెలంగాణ జానపదం.. అందరికి తెలిసిన భాషే.. కానీ మాణికే హితే పాట అలా కాదు.. ఆ సాంగ్ లిరిక్స్ ఎవరికి అర్థం కావు.. ఆలపించడం కూడా సాధ్యం కాదు.. అయినా నెట్టింట్లో సంచలనం.
నిజానికి ఈ పాటను శ్రీలంకలోని కొలంబోకు చెందిన ప్రముఖ పాప్ సింగర్ యొహాని డిసెల్వా ఆలపించారు. ప్రపంచవ్యాప్తంగా యొహాని గొంతుకు ఫిదా అయ్యారు. ఆ మ్యూజిక్.. అందుకు తగినట్టుగా యొహాని ఎక్స్ప్రెషన్స్కు యావత్ ప్రపంచం ఫిదా అయ్యింది. దీంతో యొహాని వరల్ట్ స్టార్ అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా యొహానికి.. ఆమె పాటకు అభిమానులున్నారు. తాజాగా యొహానికి పాటకు మన బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ సైతం అభిమాని అయిపోయారు. ఇంతటి పాపులర్ పాటను సల్మాన్ పాడితే ఎలా ఉంటుంది. అది కూడా.. ఆ పాట పాడిన సింగర్ యొహాని స్వయంగా సల్మాన్‌ను నేర్పించడం..
సల్మాన్ ఖాన్ ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 15కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ షోకు పాప్ సింగర్ యొహాని ముఖ్య అతిథిగా వచ్చింది. స్టేజ్ పైనే సల్మాన్ ఖాన్‌కు స్వయంగా మాణికే మాగే హితే పాడడం నేర్పించింది. అయితే ఈ పాటను పాడటానికి సల్మాన్ నానా తంటాలు పడ్డారు. లిరిక్స్‌ను తన స్టైల్లో మార్చుకుని.. శ్రీదేవి అంటూ ఫన్నీగా ఆలపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇఫ్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ముఖ్యంగా ఇందులో సల్మాన్ పాట పాడటానికి పడే కష్టాలు, అందుకు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ నవ్వులు పూయిస్తున్నాయి. సల్మాన్ కష్టాలు చూసి నెటిజన్స్ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ఆ వీడియోను మీరు ఓసారి చూసేయ్యండి.
ఇన్‌స్టా పోస్ట్..
View this post on Instagram
Also Read: RRR Movie: ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ కోసం భారీ ప్లాన్.. ప్రచారంలో కొత్త పుంతలు తొక్కిస్తున్న జక్కన్న..