Acharya: ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు.. ఆచార్య రిలీజ్ పై క్లారిటీ వచ్చేది అప్పుడేనా..?
మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ఆచార్య సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం..
Acharya: మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ఆచార్య సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం క్లైమాక్స్‌కు చేరింది. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మెగాస్టార్ రెండు విభిన్న షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. అలాగే ఈ సినిమా చరణ్ చిరు- నక్సలైట్స్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్ పాట ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఆచార్య సినిమాలో చిరుకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా చరణ్ సరసన పూజాహెగ్డే కనిపించనుంది. ధర్మస్థలి బ్యాక్ డ్రాప్‌లో సందేశాత్మక అంశాలతో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం మెగా అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తునారు. అయితే ఆచార్య రిలీజ్ డేట్ పై ఇప్పుడు సందిగ్ధత నెలకొంది.
ఆచార్య సినిమాను మే 23న విడుదల చేయాలని అనుకున్నారు చిత్రయూనిట్. కానీ కరోనా మహమ్మారి కారణంగా సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. పైగా థియేటర్స్ కూడా మూతపడ్డాయి. ఇప్పుడు కరోనా వ్యాప్తి తగ్గడంతో షూటింగ్లన్నీ శరవేగంగా జరుగుతున్నాయి. థియేటర్స్ కూడా రీఓపెన్ అవ్వడంతో సినిమాలన్నీ రిలీజ్‌లకు సిద్దమయ్యాయి. ఈ క్రమంలో ఆచార్య సినిమాను కూడా మంచి టైం చూసుకొని రిలీజ్ చేయాలని చూస్తున్నారు చిత్రయూనిట్. అక్టోబర్‌లో ఈ సినిమాను రిలీజ్ చేయాలనీ చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. అయితే రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా అక్టోబర్ 13న విడుదల కానుంది. కాబట్టి.. అక్టోబర్ నెలాఖరున ‘ఆచార్య’ను తీసుకొచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అదికూడా మిస్ అయితే సంక్రాంతికి ముందు ఆచార్య విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న రిలీజ్ డేట్ పై స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరిన్ని ఇక్కడ చదవండి :
Meera Mitun: నన్ను అరెస్ట్ చేయడం కలలోనే జరుగుతుంది.. మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన హీరోయిన్..
Pushpa: ‘పుష్ప’ సాంగ్ వచ్చేసింది.. ఊర మాస్ లుక్‌లో అదరగొట్టిన బన్నీ.. ఫ్యాన్స్‌కు ఇక పూనకాలే..