Vijay Sethupathi: విజయ్ సేతుపతి కారణంగా సినిమా పేరునే మార్చేశారు.. కారణం ఇదే..

తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు విజయ్ సేతుపతి. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు.

Vijay Sethupathi: విజయ్ సేతుపతి కారణంగా సినిమా పేరునే మార్చేశారు.. కారణం ఇదే..
Sethupathi
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 13, 2021 | 3:25 PM

Vijay Sethupathi : తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు విజయ్ సేతుపతి. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌‌‌‌గా సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ఆయన హిందీలోను అవకాశాలను అందుకున్నారు. ఓ వెబ్ సిరీస్‌‌‌‌తో విజయ్ సేతుపతి బాలీవుడ్‌‌‌‌లోకి అడుగుపెట్టనున్నారని చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగులో ఉప్పెన సినిమాతో విలన్‌‌‌‌గా నటించి భయపెట్టారు సేతుపతి. ఉప్పెన తరవాత విజయ్ సేతుపతికి అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే కోలీవుడ్‌‌‌‌లో ఈ మధ్య కాలంలో సస్పెన్స్ థ్రిల్లర్లు .. హారర్ థ్రిల్లర్ల జోరు పెరిగింది. ప్రేక్షకులు కూడా అలాంటి సినిమాలనే ఇష్టపడుతున్నారు. త్వరలో విజయ్ సేతుపతి కూడా సస్పెన్స్ థ్రిల్లర్‌‌‌‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమవుతున్నాడు. విజయ్ సేతుపతి, హీరోయిన్ తాప్సీ కలిసి నటిస్తున్న మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లినప్పుడే ‘అన్నాబెల్లె సుబ్రమణ్యం’ అనే టైటిల్‌‌‌‌ను ఖరారు చేశారు. అయితే ఇప్పుడు ఆ టైటిల్‌‌‌‌ను మార్చారు.

అయితే విజయ్ సేతుపతి ఉన్న క్రేజ్ దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాకు పేరు మార్చారు. ఈ సినిమాకు అన్నాబెల్లె సేతుపతి అని టైటిల్‌‌‌‌ను ఖరారు చేశారు. అన్నాబెల్లె సేతుపతి సినిమాను అతి త్వరలోనే డిస్నీ హాట్ స్టార్‌‌‌‌లో రిలీజ్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి మరియు తాప్సీలు ఇద్దరు కూడా ద్విపాత్రాభినయం చేస్తున్నారట. ఈ సినిమా పునర్జన్మలతో కూడిన ప్రేమకథే అయినప్పటికీ, హారర్ టచ్‌‌‌‌తో సస్పెన్స్ థ్రిల్లర్‌‌‌‌గా సాగుతుందని తెలుస్తోంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Meera Mitun: నన్ను అరెస్ట్ చేయడం కలలోనే జరుగుతుంది.. మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన హీరోయిన్..

Pushpa: ‘పుష్ప’ సాంగ్ వచ్చేసింది.. ఊర మాస్ లుక్‏లో అదరగొట్టిన బన్నీ.. ఫ్యాన్స్‏కు ఇక పూనకాలే..

Bigg Boss 5 telugu: నెట్టింట్లో ‘బిగ్‏బాస్’‏ షో హల్‏చల్.. మరోసారి కంటెస్టెంట్స్ లీస్ట్ లీక్.. వైరల్‏గా మారిన ఆట సందీప్ ట్వీట్..

Sridevi Birthday: జాన్వీని తక్కువగా అంచనా వేసిన శ్రీదేవి.. హీరోయిన్ కావాలనుకున్నప్పుడు ఎలా రియాక్ట్ అయ్యిందో తెలుసా..