AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sridevi Birthday: జాన్వీని తక్కువగా అంచనా వేసిన శ్రీదేవి.. హీరోయిన్ కావాలనుకున్నప్పుడు ఎలా రియాక్ట్ అయ్యిందో తెలుసా..

భారతీయ సినీ పరిశ్రమలో శ్రీదేవి స్థానం ప్రత్యేకం. తన అందం అభినయంతో సినీ ప్రేక్షక లోకాన్ని అలరించిన అతిలోక సుందరి, లెజండరీ నటి శ్రీదేవి. తెలుగు, తమిళం,

Sridevi Birthday: జాన్వీని తక్కువగా అంచనా వేసిన శ్రీదేవి.. హీరోయిన్ కావాలనుకున్నప్పుడు ఎలా రియాక్ట్ అయ్యిందో తెలుసా..
Sridevi
Rajitha Chanti
|

Updated on: Aug 13, 2021 | 12:39 PM

Share

భారతీయ సినీ పరిశ్రమలో శ్రీదేవి స్థానం ప్రత్యేకం. తన అందం అభినయంతో సినీ ప్రేక్షక లోకాన్ని అలరించిన అతిలోక సుందరి, లెజండరీ నటి శ్రీదేవి. తెలుగు, తమిళం, హిందీ, మలయాలం, కన్నడం ఇలా దాదాపు అన్ని భాషల్లో ఎన్నో చిత్రాల్లో నటించి కొన్ని సంవత్సరాల పాటు సినీ పరిశ్రమను ఏలింది. కేవలం దేశవ్యాప్తంగానే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా ఈ అందాల తారకు అభిమానులున్నారు. ఐదు దశాబ్దాల కెరీర్‌లో వందలాది సినిమాల్లో నటించి మెప్పించారు. బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్‏ను వివాహం చేసుకున్న తర్వాత శ్రీదేవి సినిమాలకు దూరంగా ఉన్నారు. వీరికి జాన్వీకపూర్, ఖుషీ కపూర్ ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు.

Sridevi 2

నాలుగేళ్ళ వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్‏గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి.. ఆ తర్వాత తమిళ్, తెలుగు, హిందీ, కన్నడ ఇలా అన్ని భాషలలో హీరోయిన్‏గా నటించారు. ఇక వివాహం అనంతరం తన కూతుర్లతో గడిపిన శ్రీదేవి దాదాపు 15 సంవత్సరాల తర్వాత 2011లో ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమాతో తిరిగి ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రానికి గౌరీ షిండే దర్శకత్వం వహించారు. 2018 ఫిబ్రవరిలో శ్రీదేవి గుండెపోటుతో దుబాయ్‏లో మరణించారు. ఈరోజు (ఆగస్ట్ 13న) దివంగత నటి శ్రీదేవి పుట్టిన రోజు. ఆమె తన కూతుర్ల భవిష్యత్తు గురించి ఎలాంటి కళలు నిర్మించుకుందో తెలుసుకుందామా.

Sirdevi 1

గతంలో శ్రీదేవి మరణించక ముందు ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ.. సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వడానికి తన కూతుర్లు, తన భర్త ప్రొత్సహించారని చెప్పింది. కొత్త ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడం సంతోషంగా ఉందని.. తన నటనపై తనకు అనేకసార్లు సందేహాలు కలుగుతాయని తెలిపింది. అలాగే తన కూతుర్ల గురించి చెబుతూ.. పిల్లల విషయంలో తను స్వార్థపరురాలిని కాదని తెలిపింది. ఇద్దరు కుమార్తెలు స్థిరపడిన తర్వాత వారికి వివాహం చేయానుకున్నట్లుగా చెప్పింది. వారు తమ కాళ్లపై తాము నిలబడే వృత్తి చేపట్టాలని.. స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటున్నట్లుగా తెలిపింది. అలాగే జాన్వీ కపూర్ మొదట నటను వృత్తిగా భావించినప్పుడు.. ఒక తల్లిగా పొసెసివ్‌గా భావించానని తెలిపింది. ఈ నటన వృత్తి తనకు ప్రతిదీ ఇచ్చిందని.. కానీ నటన అంటే తమ జీవితాన్ని బహిర్గతం చేయడమేనని.. కానీ జాన్వీ నటనను ఎంచుకున్నప్పుడు ఆశ్చర్యపోయానని తెలిపారు. జాన్వీ మొదటి సినిమా దడక్ చిత్రీకరణలో ఉన్నప్పుడే శ్రీదేవి మరణించారు.

Also Read: Pushpa: ‘పుష్ప’ సాంగ్ వచ్చేసింది.. ఊర మాస్ లుక్‏లో అదరగొట్టిన బన్నీ.. ఫ్యాన్స్‏కు ఇక పూనకాలే..

Bigg Boss 5 telugu: నెట్టింట్లో ‘బిగ్‏బాస్’‏ షో హల్‏చల్.. మరోసారి కంటెస్టెంట్స్ లీస్ట్ లీక్.. వైరల్‏గా మారిన ఆట సందీప్ ట్వీట్..