Pawan Kalyan: పవర్ స్టార్ సినిమా టైటిల్, ఫస్ట్ గ్లిమ్స్ వచ్చేస్తోంది.. అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన చిత్రయూనిట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే ప్రేక్షకుల్లో మాములు క్రేజ్ ఉండదు. ఆయన సినిమా కోసం అభిమానులనంతా ఎంతోఆసక్తిగా ఎదురుచూస్తున్నారు
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే ప్రేక్షకుల్లో మాములు క్రేజ్ ఉండదు. ఆయన సినిమా కోసం అభిమానులనంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దాదాపు మూడేళ్ళ గ్యాప్ తర్వాత పవన్ వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు ఓ మలయాళ రీమేక్‌తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అయ్యారు పవన్ కళ్యాణ్. మలయాళంలో మంచి విజయాన్ని అందుకున్న అయ్యప్పనుం కోషియం సినిమాలో తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో పవన్‌తోపాటు మరో హీరోగా రానా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.
అయ్యపనం కోషియం చిత్రంలో పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ అనే పోలీస్ అధికారిగా కనిపించనున్నాడు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ ఫస్ట్ గ్లిమ్స్, టైటిల్‌ను అనౌన్స్ చేయడానికి సిద్దమయ్యారు చిత్రయూనిట్. ఆగస్టు 15న ఉదయం 9.45 నిమిషాలకు ఈ మూవీ టైటిల్‌ను ఫస్ట్ గ్లిమ్స్ విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. లుంగీ కట్టుకొని పవన్ నడుస్తూ వెళ్తున్న బ్యాక్ సైడ్ ఫోటోను షేర్ చేశారు చిత్రయూనిట్. దాంతో ఆగస్టు 15 కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో పవన్‌కు జోడీగా నిత్యామీనన్ నటిస్తుంది. అలాగే రానా సరసన ఐశ్వర్య రాజేష్ నటిస్తుందని టాక్.
మరిన్ని ఇక్కడ చదవండి :
Meera Mitun: నన్ను అరెస్ట్ చేయడం కలలోనే జరుగుతుంది.. మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన హీరోయిన్..
Pushpa: ‘పుష్ప’ సాంగ్ వచ్చేసింది.. ఊర మాస్ లుక్‌లో అదరగొట్టిన బన్నీ.. ఫ్యాన్స్‌కు ఇక పూనకాలే..