Mega Family: మెగా ఫ్యామిలీలో క్రిస్మస్ సెలబ్రేషన్స్.. స్పెషల్ అట్రాక్షన్‏గా అల్లు అర్జున్, రామ్ చరణ్..

ఫ్యామిలీతో క్రిస్మస్ పండగ జరుపుకుని.. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. అభిమానులకు పండగ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సోమవారం నెట్టింట క్రిస్మస్ పండగ సందర్భంగా తారల సంబరాల ఫోటోస్ తెగ వైరలయ్యాయి. అయితే లేట్ అయినా అందరి చూపును తనవైపు తిప్పుకునే ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇంతకీ ఎవరీ ఫోటో అనుకుంటున్నారా ?.. అదే మెగా ఫ్యామిలీ పిక్.

Mega Family: మెగా ఫ్యామిలీలో క్రిస్మస్ సెలబ్రేషన్స్.. స్పెషల్ అట్రాక్షన్‏గా అల్లు అర్జున్, రామ్ చరణ్..
Mega Family
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 26, 2023 | 11:23 AM

ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ గ్రాండ్‏గా జరిగాయి. చిన్నారుల నుంచి పెద్దవాళ్ల వరకు ఈ పండగ సంబరాల్లో ఎంజాయ్ చేశారు. ఇక ఇటు భారతదేశంలోనూ క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. ఇక సినీతారల పండగ సందడి గురించి చెప్పక్కర్లేదు. ఫ్యామిలీతో క్రిస్మస్ పండగ జరుపుకుని.. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. అభిమానులకు పండగ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సోమవారం నెట్టింట క్రిస్మస్ పండగ సందర్భంగా తారల సంబరాల ఫోటోస్ తెగ వైరలయ్యాయి. అయితే లేట్ అయినా అందరి చూపును తనవైపు తిప్పుకునే ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇంతకీ ఎవరీ ఫోటో అనుకుంటున్నారా ?.. అదే మెగా ఫ్యామిలీ పిక్. మెగా కుటుంబంలో క్రిస్మస్ సెలబ్రేషన్స్ జోరుగా జరిగినట్లుగా తెలుస్తోంది.

ప్రతి పండక్కి మెగా ఫ్యామిలీలలో అందరూ కలిసి సెలబ్రెట్ చేసుకుంటారు. మెగాస్టార్ చిరంజీవి నివాసంలో పవన్, నాగబాబు, సాయి ధరణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ కుటుంబాలు కలిసి సందడి చేస్తుంటాయి. అలాగే కొని సందర్భాల్లో అల్లు ఫ్యామిలీ కూడా కలుస్తుంటుంది. తాజాగా క్రిస్మస్ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ మాత్రం అల్లు, మెగా కుటుంబాలు కలిసి జరుపుకున్నాయి. క్రిస్మస్ కోసం మెగా హీరోలతోపాటు కజిన్స్ అంతా ఒక్కచోట చేరారు. సాయి దరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, వరుణ్ తేజ్, నిహారిక, ఉపాసన, శ్రీజ కొణిదెల, అల్లు శిరీష్ , అల్లు బాబీ, సుస్మిత.. ఇలా మరికొంతమంది మెగా ఫ్యామిలీ మెంబర్స్ కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. ఇందుకు సంబంధించిన ఫోటో ఇప్పుడు నెట్టింట వైరలవుతుండగా.. అందులో అల్లు అర్జున్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాత్రం స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. చాలా రోజులుగా చరణ్, బన్నీ మధ్య మాటలు లేవంటూ రూమర్స్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా కొద్దిరోజులుగా వీరిద్దరూ కలిసి కనిపించలేదు. దీంతో ఇద్దరి మధ్య మాటలు లేవంటూ మరోసారి రూమర్స్ వినిపించాయి. ఇప్పటికే ఈ విషయం పై ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఎన్నిసార్లు క్లారిటీ ఇచ్చిన రూమర్స్ మాత్రం ఆగడం లేదు. ఈ క్రమంలోనే ఇప్పుడు నెట్టింట వైరలవుతున్న ఫోటోతో మరోసారి బన్నీ, చరణ్ గురించి వస్తున్న రూమర్స్ కు చెక్ పడింది.

View this post on Instagram

A post shared by Sushmita (@sushmitakonidela)

తాజాగా నెట్టింట వైరలవుతున్న ఫోటోలో కొత్త కోడలు లావణ్య త్రిపాఠి సైతం చేరిపోయింది. నవంబర్ 1న వరుణ్, లావణ్య త్రిపాఠి పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే. చాలా కాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరు పెద్దల సమక్షంలో మూడు మూళ్ల బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లి తర్వాత మెగా కజిన్స్ మొదటి మీట్ కావడంతో లావణ్య సైతం ఈ గ్యాంగ్‏లో చేరిపోయింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.