Vegetable Prices: మార్కెట్‌లో ఆకాశానంటుతున్న కూరగాయల ధరలు..! రీజన్ ఏంటో తెలుసా?
గత కొన్ని రోజులుగా కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. మార్కెట్‌లోకి వెళ్లి కూరగాయాలు కొందామంటే జనాలు భయపడుతున్నారు. ఎందుకంటే రూ.500 వందలు తీసుకెళ్తే సరిగ్గా ఐదు కేజీల కూరగాయలు కూడా రావట్లేదు. అయితే కూరగాయల రేట్లు ఈ మధ్య కాలంలోనే భారీగా పెరిగాయి. ఇందుకు ప్రధానం కారణం ఏంటని మీరెప్పుడైనా ఆలోచించారా? వీటి రేట్లు ఇంతలా పెరగడానికి ప్రధాన కారణం తగ్గిన ఉష్ణోగ్రతలేనట. అవుతను ఉష్ణోగ్రతలు కూరగాయల రేట్లను ఎలా ప్రభావితం చేస్తాయి అనుకుంటున్నారా? అయితే తెలుసుకుందాం పదండి.

ప్రస్తుతం మార్కెట్‌లో అన్ని కూరగాయల రేట్లు సెంచరి దాటాయి. ఇందుక ప్రధాన కారణంగా వాటి ఉత్పత్తి ఎక్కువగా లేకపోవడం. రాష్ట్రంలో తగ్గుతున్న ఉష్ణోగ్రతల కారణంగా చలితీవ్రత పెరిగింది. ఇది కూరగాయల సాగుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఉష్ణోగ్రతలు తగ్గడం కారణంగా కూరగాయల దిగుబడి తగ్గిపోయింది. దీంతో కూరగాయలకు రేట్లు భారీగా పెరిగాయి. ఈ ధరలు అటు వినియోగదారులకు సైతం ఇబ్బంది పెడుతున్నాయి.
ఈ చలితీవ్రత ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. పెరిగిన చలికారణంగా టామోటా చెట్ల ఆకులు నల్లబడి పూత రాలిపోతుంది. దీంతో టామోటా దిగుబడి తగ్గిపోయింది. దీంతో వాటికి డిమాండ్ పెరిగి.. ధరలు కూడా పెరిగాయి. ఒక్క టామోటా మాత్రమే కాదు బీరకాయ, బెండ, కాకార, పచ్చి మిర్చి అన్నింటి పరిస్థితి ఇదే. చలితో పిందె దశలోనే కూరగాయలు కింద పడిపోతున్నాయి. ఆకు పైన ఎక్కువ సేపు మంచు ఉండటంతో అవి నల్లబడిపోయి రాలిపోతున్నాయి. దీంతో దిగుబడి తగ్గుతుంది. దీంతో వాటి లభ్యత తగ్గి డిమాండ్ పెరుగుతుంది.
కూరగాయల రేట్లు పెరగడంతో సామాన్యుడు లబో దిబోమంటున్నారు. గతంలో 200 రూపాయాలకు వారం రోజుల సరిపడే కూరగాయాలు వస్తే.. ఇప్పుడు రెండు రోజులు కూడా రావడం లేదని ఆందోళన చెందుతున్నాడు. ఎప్పుడు సామాన్యుడికి అందుబాటలో ఉండే టమోటో, ఆకు కూరల ధరలు భారీగా పెరిగడంతో ఏవి కొనాలో అనే ఆయోమయలో పడిపోయారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
