Mansoor Ali Khan: ‘బెదిరింపులకు భయపడే వ్యక్తిని కాను’.. త్రిష వివాదంపై స్పందించిన మన్సూర్ అలీఖాన్..

సినిమాలో త్రిషతో బెడ్ రూమ్ సీన్ లేకపోవడం పట్ల విచారం వ్యక్తం చేసినట్లు నెట్టింట ఓ వీడియో వైరలయ్యింది. దీంతో మన్సూర్ వ్యాఖ్యలపై కోలీవుడ్ స్టార్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగర్ చిన్మయి శ్రీపాద, హీరోయిన్ మాళవిక మోహనన్, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ స్పందిస్తూ.. మన్సూర్ కామెంట్స్ ను ఖండించారు. అటు త్రిష సైతం మన్సూర్ వీడియోపై సీరియస్ అయ్యింది. ఇక పై తన సినిమా కెరీర్ లో ఇలాంటి నటుడితో పనిచేయను అంటూ తెల్చీ చెప్పేసింది. నెట్టింట జరుగుతున్న త్రిష వివాదం పై నటుడు మన్సూర్ అలీ స్పందించాడు.

Mansoor Ali Khan: 'బెదిరింపులకు భయపడే వ్యక్తిని కాను'.. త్రిష వివాదంపై స్పందించిన మన్సూర్ అలీఖాన్..
Trisha, Mansoor Ali Khan
Follow us

|

Updated on: Nov 19, 2023 | 8:30 PM

హీరోయిన్ త్రిష గురించి లియో సహనటుడు మన్సూర్ అలీ ఖాన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపాయి. సినిమాలో త్రిషతో బెడ్ రూమ్ సీన్ లేకపోవడం పట్ల విచారం వ్యక్తం చేసినట్లు నెట్టింట ఓ వీడియో వైరలయ్యింది. దీంతో మన్సూర్ వ్యాఖ్యలపై కోలీవుడ్ స్టార్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగర్ చిన్మయి శ్రీపాద, హీరోయిన్ మాళవిక మోహనన్, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ స్పందిస్తూ.. మన్సూర్ కామెంట్స్ ను ఖండించారు. అటు త్రిష సైతం మన్సూర్ వీడియోపై సీరియస్ అయ్యింది. ఇక పై తన సినిమా కెరీర్ లో ఇలాంటి నటుడితో పనిచేయను అంటూ తెల్చీ చెప్పేసింది. నెట్టింట జరుగుతున్న త్రిష వివాదం పై నటుడు మన్సూర్ అలీ ఖాన్ స్పందించాడు. తన వ్యాఖ్యలను తప్పుగా ఎడిట్ చేశారని.. లియో సినిమాలో త్రిష పాత్ర.. ఆమె నటనను తాను ఎంతో పొగిడానని తెలియజేస్తూ తమిళంలో ఓ నోట్ షేర్ చేశారు.

“త్రిష గురించి నేను తప్పుగా మాట్లాడానని వస్తోన్న వార్తలను నా కుమార్తె, కొడుకు నాకు పంపారు. ఇది నా సినిమా విడుదల సమయంలో వచ్చింది. అలాగే నేను రాబోయే ఎన్నికలలో పోటీ చేస్తున్నాను. ఆ వీడియోలో నేను త్రిష గురించి గొప్పగా మాట్లాడాను. ఆమె నటనను ప్రశంసించాను. పాతకాలం లాగా ఈ రోజుల్లో హీరోయిన్స్‌తో నటించే అవకాశాలు రావడం లేదు అని నా అభిప్రాయాన్ని చెప్పాను. కానీ ఆ వీడియో చూస్తుంటే నా మాటలను ఎడిట్ చేసి త్రిషకు వ్యతిరేకంగా మాట్లాడినట్లుగా ట్రిమ్ చేశారు. ఇక ఈ వీడియో చూసి త్రిష నాపై కోప్పడేలా చేశారు. ఇలాంటి వివాదాలు సృష్టించే బెదిరింపులకు నేను భయపడే వ్యక్తిని కాదు. త్రిషకు ట్రిమ్ చేసిన వెర్షన్‌ను చూపించారు. నాతో కలిసి నటించిన హీరోయిన్లు ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఉన్నారు. వారు విజయవంతమైన వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్నారు. లియో పూజా కార్యక్రమంలో త్రిషతో నా కూతురు దిల్రూబా ఫ్యాన్ అని చెప్పాను.

నేను 360కి పైగా సినిమాల్లో నటించాను. నా ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్లు కావాల్సి ఉంది. నేనే వారికి పెళ్లి చేయాలి. నేనెప్పుడూ నా సహనటులను గౌరవిస్తాను. నేను మహిళలను ఎంతగా గౌరవిస్తానో నాతో కలిసి నటించిన అందరికీ తెలుసు. కానీ ఇది నన్ను వ్యతిరేకించే కొందరు చేసిన పని.. త్రిషకు కోపం తెప్పించేందుకు ఆమెకు ట్రిమ్ చేసిన వెర్షన్ చూపించారు. దీనికంటే ప్రపంచంలో చాలా ముఖ్యమైన సమస్యలు ఉన్నాయి. ముందు దానిపై ఫోకస్ చేయండి” అంటూ ఓ నోట్ షేర్ చేశారు మన్సూర్ అలీ ఖాన్.

మన్సూర్ అలీ ఖాన్ వీడియో విషయానికి వస్తే.. అందులో.. “నేను త్రిషతో కలిసి నటిస్తున్నానని విన్నప్పుడు, చిత్రంలో బెడ్‌రూమ్ సన్నివేశం ఉంటుందని అనుకున్నాను. నేను ఆమెను బెడ్‌రూమ్‌కి తీసుకువెళ్లాలని అనుకున్నాను. నా మునుపటి సినిమాల్లో ఇతర నటీమణులతో చేశాను. నేను చాలా రేప్ సన్నివేశాలు చేశాను. ఇది నాకు కొత్త కాదు. కానీ కశ్మీర్‌లో షూటింగ్ సమయంలో సెట్స్‌లో కూడా త్రిషను నాకు చూపించలేదు ” అని మాట్లాడినట్లుగా కనిపిస్తుంది. ఈ వీడియోపై త్రిష స్పందిస్తూ.. “మిస్టర్ మన్సూర్ అలీ ఖాన్ నా గురించి నీచంగా, అసహ్యంగా మాట్లాడిన వీడియో నా దృష్టికి వచ్చింది. నేను దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది స్త్రీకి అగౌరవం, స్త్రీ ద్వేషం, అసహ్యకరమైనది, చెడు అభిరుచిని కలిగి ఉంటాడు. నా మిగిలిన సినిమా కెరీర్‌లో అతనితో నటించను. అతనిలాంటి వ్యక్తులు మానవాళికి చెడ్డ పేరు తెస్తారు .” అంటూ ట్వీట్ చేసింది. అయితే ఇప్పుడు మన్సూర్ ఇచ్చిన క్లారిటీ పై త్రిష ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

హమాస్‌-ఇజ్రాయెల్‌ సంధి ముగిసింది.. గాజాలో మళ్లీ యుద్ధం మొదలైంది.!
హమాస్‌-ఇజ్రాయెల్‌ సంధి ముగిసింది.. గాజాలో మళ్లీ యుద్ధం మొదలైంది.!
సలాడ్‌లో మనిషి వేలు.. రెస్టారెంట్‌కు వెళ్లిన మహిళకు భారీ షాక్.!
సలాడ్‌లో మనిషి వేలు.. రెస్టారెంట్‌కు వెళ్లిన మహిళకు భారీ షాక్.!
బాబోయ్.. విజయ్ దేవరకొండ స్టైలీష్ గాగుల్స్ అంత ఖరీదా ?..
బాబోయ్.. విజయ్ దేవరకొండ స్టైలీష్ గాగుల్స్ అంత ఖరీదా ?..
Telangana Elections: కౌంటింగ్ ప్రక్రియ ఎలా జరుగుతుందో తెలుసా..?
Telangana Elections: కౌంటింగ్ ప్రక్రియ ఎలా జరుగుతుందో తెలుసా..?
ఆంధ్ర - ఒడిస్సా సరిహద్దుల్లో ముమ్మర తనిఖీలు.. అసలు కారణం ఇదే..
ఆంధ్ర - ఒడిస్సా సరిహద్దుల్లో ముమ్మర తనిఖీలు.. అసలు కారణం ఇదే..
మిజోరం ఎన్నికల ఫలితాలు రేపు లేనట్లే.. కౌంటింగ్‌ ఎప్పుడంటే..?
మిజోరం ఎన్నికల ఫలితాలు రేపు లేనట్లే.. కౌంటింగ్‌ ఎప్పుడంటే..?
సౌతిండియా బ్యూటీ ఈ అమ్మాయి.. ఫాలోయింగ్ మాములుగా ఉండదు..
సౌతిండియా బ్యూటీ ఈ అమ్మాయి.. ఫాలోయింగ్ మాములుగా ఉండదు..
ఆ రాశి వారికి బ్రహ్మాండమైన రోజుఇవాళ వారికి అన్నీ అనుకూలమే.!
ఆ రాశి వారికి బ్రహ్మాండమైన రోజుఇవాళ వారికి అన్నీ అనుకూలమే.!
హైదరాబాద్‌లో బోగస్ ఓట్ల కలకలం.. పోలీసుల అదుపులోకి నిందితులు..
హైదరాబాద్‌లో బోగస్ ఓట్ల కలకలం.. పోలీసుల అదుపులోకి నిందితులు..
ఓటేయకుండా ప్రభాస్‌ డుమ్మా.. మీరు ఇలా చేస్తారనుకోలేదు.!
ఓటేయకుండా ప్రభాస్‌ డుమ్మా.. మీరు ఇలా చేస్తారనుకోలేదు.!
హమాస్‌-ఇజ్రాయెల్‌ సంధి ముగిసింది.. గాజాలో మళ్లీ యుద్ధం మొదలైంది.!
హమాస్‌-ఇజ్రాయెల్‌ సంధి ముగిసింది.. గాజాలో మళ్లీ యుద్ధం మొదలైంది.!
సలాడ్‌లో మనిషి వేలు.. రెస్టారెంట్‌కు వెళ్లిన మహిళకు భారీ షాక్.!
సలాడ్‌లో మనిషి వేలు.. రెస్టారెంట్‌కు వెళ్లిన మహిళకు భారీ షాక్.!
మిజోరం ఎన్నికల ఫలితాలు రేపు లేనట్లే.. కౌంటింగ్‌ ఎప్పుడంటే..?
మిజోరం ఎన్నికల ఫలితాలు రేపు లేనట్లే.. కౌంటింగ్‌ ఎప్పుడంటే..?
ఆ రాశి వారికి బ్రహ్మాండమైన రోజుఇవాళ వారికి అన్నీ అనుకూలమే.!
ఆ రాశి వారికి బ్రహ్మాండమైన రోజుఇవాళ వారికి అన్నీ అనుకూలమే.!
ఓటేయకుండా ప్రభాస్‌ డుమ్మా.. మీరు ఇలా చేస్తారనుకోలేదు.!
ఓటేయకుండా ప్రభాస్‌ డుమ్మా.. మీరు ఇలా చేస్తారనుకోలేదు.!
యానిమల్ సినిమాపై భారీ అంచనాలు..! యానిమల్ హిట్టా.? ఫట్టా.?
యానిమల్ సినిమాపై భారీ అంచనాలు..! యానిమల్ హిట్టా.? ఫట్టా.?
అదిరిపోయిన ట్రైలర్‌ ఒక్కొక్కరికీ గూస్‌ బంప్సే | వావ్! వాటే సినిమా
అదిరిపోయిన ట్రైలర్‌ ఒక్కొక్కరికీ గూస్‌ బంప్సే | వావ్! వాటే సినిమా
ఏపీకి తుఫాను ముప్పు.. ఐఎండీ హెచ్చరిక.! నాలుగు రోజుల పాటు వర్షాలు.
ఏపీకి తుఫాను ముప్పు.. ఐఎండీ హెచ్చరిక.! నాలుగు రోజుల పాటు వర్షాలు.
నయనతారకు అదిరిపోయే బర్త్‌డే గిఫ్ట్‌ ఇచ్చిన విఘ్నేష్‌ శివన్‌.
నయనతారకు అదిరిపోయే బర్త్‌డే గిఫ్ట్‌ ఇచ్చిన విఘ్నేష్‌ శివన్‌.
చేపల వేటకు వెళ్ళిన బోటులో అగ్నిప్రమాదం.! బోటులో 11 మంది..
చేపల వేటకు వెళ్ళిన బోటులో అగ్నిప్రమాదం.! బోటులో 11 మంది..