Ponniyin Selvan: కొనసాగుతోన్న పొన్నియ సెల్వన్ హావా.. యూస్ లో మరో అరుదైన రికార్డు..

పొన్నియిన్‌ సెల్వన్‌.. ఈ సినిమా సృష్టిస్తోన్న సంచలనాలకు ఇప్పట్లో ఫుల్‌స్టాప్‌ పడేలా కనిపించడం లేదు. మణిరత్నం డ్రీమ్‌ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన

Ponniyin Selvan: కొనసాగుతోన్న పొన్నియ సెల్వన్ హావా.. యూస్ లో మరో అరుదైన రికార్డు..
Ponniyin Selvan Collection
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Oct 25, 2022 | 6:45 AM

పొన్నియిన్‌ సెల్వన్‌.. ఈ సినిమా సృష్టిస్తోన్న సంచలనాలకు ఇప్పట్లో ఫుల్‌స్టాప్‌ పడేలా కనిపించడం లేదు. మణిరత్నం డ్రీమ్‌ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ ముందు రికార్డులను తిరగరాస్తోంది. సెప్టెంబర్‌ 30న విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ హౌజ్‌ ఫుల్‌ కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. విక్రమ్‌, జయంరవి, కార్తీ, ఐశ్వర్యారాయ్, త్రిషలాంటి భారీ స్టార్‌ కాస్టింగ్‌తో తెరకెక్కిన ఈ సినిమా గత రికార్డులను తిరగరాస్తుంది ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదలైన ఈ సినిమా అన్ని చోట్ల పాజిటివ్‌ టాక్‌ సంపాదించుకొని రికార్డు కలెక్షన్లతో దుమ్మురేపుతోంది.

తమిళ నాట అయితే ఈ ఏడాదిలో మరో బిగ్గెస్ట్ హిట్ గా ఈ చిత్రం నిలిచి భారీ గ్రాసర్ గా నిలిచింది.తమిళనాడులో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. కమల్‌ హాసన్‌ హీరోగా వచ్చిన విక్రమ్‌ సినిమా రికార్డులను సైతం బ్రేక్‌ చేయడం విశేషం మరి తమిళ్ లోనే కాకుండా యూఎస్ లో కూడా ఈ చిత్రం భారీ వసూళ్లు నమోదు చేయడం విశేషం. తమిళ్ వెర్షన్ నుంచి అయితే టోటల్ గా 6 మిలియన్ మార్క్ ని యూఎస్ లో అందుకోడమే పెద్ద సెన్సేషన్ అయితే లేటెస్ట్ గా ఈ చిత్రం 6.5 మిలియన్ మార్క్ ని టచ్ చేసినట్టుగా ట్రేడ్ వర్గాలు వారు తెలుపుతున్నారు.