Avatar 2 : అమ్మో ఇంత పెద్ద సినిమానా..? అవతార్ మూవీ రన్ టైం తెలిస్తే అవాక్ అవ్వాల్సిందే..
2009లో విడుదలైన 'అవతార్' మొదటి పార్ట్ ప్రేక్షకులకు సరికొత్త ఊహా ప్రపంచంలోకి తీసుకెళ్లింది. ఇక ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను ఆకట్టుకుంది.
హాలీవుడ్ మూవీస్ లో ప్రస్తుతం మోస్ట్ ఏవైటెడ్ మూవీ అవతార్ 2 గతంలో వచ్చిన అవతార్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమెరికన్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టి ‘అవతార్’. 2009లో విడుదలైన ‘అవతార్’ మొదటి పార్ట్ ప్రేక్షకులకు సరికొత్త ఊహా ప్రపంచంలోకి తీసుకెళ్లింది. ఇక ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను ఆకట్టుకుంది. అవతార్ సినిమా తర్వాత అలాంటి సోషియో ఫాంటసీ సినిమాలకు క్రేజ్ మరింత పెరిగింది. మనుషులకు గ్రహాంతర వాసులకు మధ్య జరిగే యుద్ధంన్ని అద్భుతంగా చూపించారు దర్శకుడు జేమ్స్. 234 మిలియన్ డాలర్ల బడెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 2.924 బిలియన్ డాలర్లను వసూళ్లను రాబట్టింది.ఇక ఇప్పుడు అవతార్ పార్ట్ 2 తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
కేవలం రెండు పార్టులు మాత్రమే కాదు దాదాపు 5 పార్టులు రానున్నాయి. ఇప్పటికే ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ కూడా చేశారు దర్శకుడు జేమ్స్ . ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా కు సంబందించిన ఓ వార్త ఫిలిం సర్కిల్ లో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాను 16 డిసెంబర్ 2022న ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లో విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు . ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అవతార్-2′ రన్ టైమ్ సైతం భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. అవతార్ మొదటి పార్ట్ రన్ టైం రెండు గంటల 42 నిమిషాలకు కాగా రెండో పార్ట్ రన్ టైమ్ మాత్రం మూడు గంటల పది నిమిషాలు ఉండబోతుందట. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.




