AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MAA Elections: పోటీలో నలుగురు అభ్యర్థులు.. రసవత్తరంగా ‘మా’ ఎన్నికలు… పదవి పోటీపై క్లారిటీ ఇవ్వనున్న మంచు విష్ణు..

టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు సాధారణ రాజకీయ ఎన్నికలను తలపిస్తున్నాయి. ప్రతిసారీ ఇద్దరు మాత్రమే పోటీ పడే ఎన్నికలలో ఈసారి నలుగురు

MAA Elections: పోటీలో నలుగురు అభ్యర్థులు.. రసవత్తరంగా 'మా' ఎన్నికలు... పదవి పోటీపై క్లారిటీ ఇవ్వనున్న మంచు విష్ణు..
Manchu Vishnu
Rajitha Chanti
|

Updated on: Jun 24, 2021 | 2:13 PM

Share

టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు సాధారణ రాజకీయ ఎన్నికలను తలపిస్తున్నాయి. ప్రతిసారీ ఇద్దరు మాత్రమే పోటీ పడే ఎన్నికలలో ఈసారి నలుగురు అభ్యర్థులు పోటీ పడుతుండడంతో మా ఎన్నికలు మరింత వేడెక్కాయి. నిన్న మొన్నటివరకు మంచు విష్ణు… ప్రకాష్ మధ్య పోటీ ఉందనుకుంటే.. అనుహ్యాంగా జీవితరాజశేఖర్ పోటీకి సిద్ధంమంటూ తెలిపారు. దీంతో మా ఎన్నికలు సమరం మరింత రసవత్తరంగా మారింది. ఇక నటి హేమ కూడా పోటీలో పాల్గోనబోతున్నట్లుగా ప్రకటించడంతో.. చిత్రసీమ ఎన్నికలు.. సాధారణ రాజకీయ ఎన్నికలను తలపిస్తున్నాయి. పోటీలో నలుగురు కనిపిస్తున్న కూడా ఇద్దరి మధ్య ఎక్కువగా ఈ వార్ జరిగేలా అనిపిస్తుంది. చిరంజీవి కుటుంబం అండదండలతో ప్రకాష్ రాజ్ ఎన్నికల బరిలో దిగుతున్నాడు. మరోవైపు కృష్ణ, బాలకృష్ణ లాంటి సీనియర్ నటులు మంచు విష్ణుకు అండగా ప్రచారం చేయడానికి ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. జీవితకు ఎవరు ప్రచారం చేస్తారు అనేది ఇప్పటివరకు క్లారిటీ లేదు. ఇక సీనియర్ నటి హేమ సంగతి పెద్దగా పట్టించుకున్నట్లు కూడా అనిపించడం లేదు.

ఇక మా ఎన్నికలకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ కూడా వెలువడకముందే సినీ ఇండస్ట్రీలో ఎన్నికల సందడి నెలకొంది. అభ్యర్థులు నువ్వా నేనా అనుకుంటున్నారు. కేవలం రెండేళ్లు మాత్రమే ఈ పదవి కోసం చాలా ప్రయత్నిస్తున్నారు సీనియర్ నటులు. ఇదిలా ఉంటే.. హీరో మంచు విష్ణు ఈరోజు సాయంత్రం మా అధ్యక్ష పోటీపై క్లారిటీ ఇవ్వనున్నారు. కేవలం మెజారిటీ సినీ ప్రముఖులు పోటీ చేయాలని ఒత్తిడి తీసుకువస్తున్నారు. అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని నిర్ణయం తీసుకుంటాను అని విష్ణు అన్నారు. ఇక మా ఎన్నికలలో నందమూరి కళ్యాణ్ రామ్ కూడా పాల్గోనబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో… మా అద్యక్ష పదవి పోటీలోకి తన పేరు తీసుకురావడం పై కళ్యాణ్ రామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మా అద్యక్షుడిగా పోటీ చేసే ఉద్దేశ్యం లేదని స్పష్టం చేశారు. మరీ ఈసారి మా అద్యక్ష పీఠాన్ని వరించేదేవరో చూడాలంటే ఇంకా కొన్ని రోజులు ఆగాల్సిందే.

Also Read: Afidavit in High Court: కరోనాతో అనాథలుగా మారిన 177 మంది చిన్నారులు.. ఎన్నికల విధుల్లో పాల్గొన్న 19 మంది అధ్యాపకుల మ‌‌ృతి!

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!