Mosagallu Movie Pre Release Event Live : క్రాస్‌ ఓవర్‌ మూవీతో రానున్న మంచు విష్ణు.. ఘనంగా ప్రీరిలీజ్ ఈవెంట్

మంచు విష్ణు, కాజల్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మోసగాళ్లు’. జెఫ్రీ గీ చిన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో విష్ణు-కాజల్‌ అన్నాచెల్లెలుగా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్

Mosagallu Movie Pre Release Event Live : క్రాస్‌ ఓవర్‌ మూవీతో  రానున్న మంచు విష్ణు.. ఘనంగా ప్రీరిలీజ్ ఈవెంట్
Vishnu
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 15, 2021 | 7:46 PM

Mosagallu Movie  : మంచు విష్ణు, కాజల్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మోసగాళ్లు’. జెఫ్రీ గీ చిన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో విష్ణు-కాజల్‌ అన్నాచెల్లెలుగా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ సినిమా పైన ఆసక్తిని పెంచేసాయి. ప్రపంచంలోనే అతి పెద్ద ఐటీ కుంభకోణం నేపథ్యంలో రూపొందిన చిత్రమది. బాలీవుడ్‌ నటుడు సునీల్‌శెట్టి ఈ సినిమాలో పోలీస్‌పాత్రలో కనిపించనున్నారు. నవ్‌దీప్‌ కూడా ఈ సినిమాలో కీలకపాత్రలో కనిపించనున్నారు. కొంత కాలంగా బిజినెస్‌ మీదే ఎక్కువగా దృష్టి పెట్టిన ఈ యంగ్‌ హీరో ఇప్పుడు ఈ క్రాస్‌ ఓవర్‌ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. 24 ఫిలిం ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌లపై మంచు విష్ణు స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ఎంతో ఆసక్తికరంగా సాగింది. కాజల్‌, విష్ణుల డైలాగులు బాగున్నాయి. ట్రైలర్ చూస్తున్నంతసేపు తరువాత ఏం జరుగుతుందన్న ఉత్కంఠను రేపుతోంది. సినిమాపై ఉన్న అంచనాలను ట్రైలర్‌ తారాస్థాయికి చేర్చింది. తాజాగా ఈ మోసగాళ్లు సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరుగుతుంది. మోసగాళ్లు ప్రీరిలీజ్ ఈవెంట్ ను ఈ కింద వీక్షించండి.

మోసగాళ్లు ప్రీరిలీజ్ ఈవెంట్