Vishnu Manchu : నా సినిమాలో హీరో నేను కాదు.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన మంచువారబ్బాయి..
Mosagallu Movie : టాలీవుడ్ టాల్ హీరో మంచు విష్ణు ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. ఒక వైపు మోసగాళ్లు అనే సినిమా చేస్తూనే మరో వైపు సూపర్ హిట్ మూవీ ఢీ సినిమాకు సీక్వెల్ ను పట్టాలెక్కించనున్నాడు.
Mosagallu Movie : టాలీవుడ్ టాల్ హీరో మంచు విష్ణు ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. ఒక వైపు మోసగాళ్లు అనే సినిమా చేస్తూనే మరో వైపు సూపర్ హిట్ మూవీ ఢీ సినిమాకు సీక్వెల్ ను పట్టాలెక్కించనున్నాడు. ఈ క్రమంలో మోసగాళ్లు సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో విష్ణు చెల్లెలుగా చందమామ కాజల్ అగర్వాల్ నటిస్తుంది.
ఇక మరో కీలక పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్లు , టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ సినిమా ట్రైలర్ సినిమా పైన అంచనాలను పెంచింది. ఐటీ స్కామ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది.
ఇక ఈ సినిమాకు జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహిస్తున్నాడు. మోసగాళ్లు సినిమా ట్రైలర్ ను గురువారం మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. ఈ సంధర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో విష్ణు సినిమా గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
మంచు విష్ణు మాట్లాడుతూ .. సినిమాలో అన్న చెల్లెల్లు ఇద్దరు కాల్ సెంటర్స్‌లలో వేల కోట్ల స్కామ్ చేస్తారు. భారతీయ న్యాయశాస్త్రాన్ని అతిక్రమించకుండా వారు ఆ స్కామ్ ఎలా చేయగలిగారు..? కొట్టేసిన డబ్బు ను వారు ఏంచేశారు..? అనే ఇంటరెస్టింగ్ పాయింట్‌స్ తో ఈ సినిమా సాగుతుంది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ నా చెల్లెలుగా నటించింది. ఈ సినిమాకు నేను హీరో కాదు ఆమె హీరో. నా పాత్ర అంతా నెగెటివ్ షేడ్స్‌తో సాగుతుంది.
ఇప్పటివరకు భారీ బడ్జెట్ సినిమాల్లో నటించలేదు. నేను నటించిన మొదటి భారీ బడ్జెట్ సినిమా ఇది. ఇండస్ట్రీలో నా మార్కెట్‌కు మించి సినిమాకోసం ఖర్చు చేశా. హీరోగా స్థాయిని ఈ సినిమా ఖచ్చితంగా పెంచుతుందనే నమ్మకముంది. ఇక ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరీయస్-2’ తెరకెక్కించిన హాలీవుడ్ దర్శకుడు జాన్ నాకు మంచి స్నేహితుడు. ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి సరైన దర్శకుడి కోసం వెతుకున్న సమయంలో అతడే జెఫ్రీ గీ చిన్ పేరును సూచించారు.
అలాగే సినిమా నవదీప్, నవీన్‌చంద్ర కీలక ;పాత్రలో నటించారు. వారితో పాటు ప్రతి ఒక్కరూ అద్భుతంగా నటించారు. పోలీస్ అధికారిగా సునీల్‌శెట్టి పాత్రపవర్ ఫుల్ గా ఉంటుంది. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ ను త్వరలో వెల్లడిస్తాం. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఒకేసారి సినిమాను విడుదలచేయబోతున్నాం. ఇంగ్లీష్‌లో మాత్రం ఈ ఏడాది చివరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’ అంటూ విష్ణు తెలిపారు.
మరిన్ని ఇక్కడ చదవండి :
Check Movie Review: చెక్ మూవీ ట్విట్టర్ రివ్యూ.. అభిమానుల స్పందన ఇదే.. బొమ్మకు హిట్ టాక్.!