AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దాసరి సమాధి దుస్థితిపై స్పందించిన మంచు మనోజ్.. శబాష్ అన్న అంటున్న అభిమానులు

దిగ్గజ దర్శకుడు దాసరి నారాయణరావు తెలుగు సినిమా చరిత్ర పై చెరగని ముద్ర వేశారు. ఎన్నో అద్భుతమైన సినిమాలు తెరకెక్కించి ప్రేక్షకులను అలరించారు. నేడు దాసరి నారాయణరావు వర్ధంతి.. కాగా ఆయన సమాధికి సంబంధించిన ఓ వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది..

దాసరి సమాధి దుస్థితిపై స్పందించిన మంచు మనోజ్.. శబాష్ అన్న అంటున్న అభిమానులు
Manchu Manoj
Rajeev Rayala
|

Updated on: May 30, 2026 | 12:59 PM

Share

తెలుగు సినిమా గర్వించదగ్గ దర్శకుల్లో మొదటి వరుసలో ఉంటారు దర్శక రత్న దాసరి నారాయణరావు. ఎన్నో అద్భుతమైన సినిమాలు తెరకెక్కించారు దాసరి. అత్యధిక చిత్రాల దర్శకుడుగా గిన్నిస్‌ పుటలకెక్కారు. దాదాపు 150 చిత్రాలకు దర్శకత్వం వహించారు దాసరి. అలాగే  53 సినిమాలు స్వయంగా నిర్మించారు. అంతే కాదు 250 పైగా చిత్రాలలో సంభాషణ రచయితగా పనిచేశాచేశారు. ఇక యాక్టర్ గా ఆయన నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళం, కన్నడ భాషా చిత్రాలలో నటించి, తన నటనకుగాను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ నటునిగా బహుమతి కూడా అందుకున్నారు. అంతే కాదు సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్నారు దాసరి. అనేకమంది కొత్త కళాకారులను సినీరంగానికి పరిచయం చేసి తారలు అయ్యేందుకు దోహదపడ్డారు. ఒకానొక సమయంలో ఈయన పేరిట 18,000 కు పైగా అభిమానసంఘలు ఉండేవి.

ఇది కూడా చదవండి : బాలయ్య సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్‌గా హీరోయిన్‌గా చేసిన ఏకైక నటి.. ఆ కుర్రాడు కూడా హీరోనే

దాసరి నారాయణరావు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ సికిందరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో 2017 మే 30న మరణించారు. నేడు ఆయన వర్ధంతి. అయితే ఇటీవల దాసరి సమాధికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఓ యాంకర్ షూటింగ్ నిమిత్తం చేవెళ్ల ఏరియాకు వెళ్లగా అక్కడ దాసరి సమాధి కనిపించింది. చుట్టూ పిచ్చిమొక్కలు. ఎవ్వరూ పట్టించుకోని పరిస్థితిలో చెత్త చెదారం పేరుకుపోయి కనిపించింది. అంత గొప్ప వ్యక్తి, సినిమా ఇండస్ట్రీకి ఎంతో సేవ చేసిన ఆయన సమాధిని అలా చూసేసారు నా మనసు చివ్వుక్కుమంది అంటూ ఆ యాంకర్ వీడియో రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : Folk Song: ఏం పాట మావ..! అమ్మాయిలు తెగ పాడుకుంటున్న సాంగ్.. వచ్చి 5 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ ట్రెండింగ్‌లోనే

అది కాస్త వరాల అవ్వడంతో నటుడు మంచు మనోజ్ స్పందించారు. దాసరి సమాధిని శుబ్రపరిచే పనులు చేపట్టారు. దాసరి సమాధిని దర్శించుకొని ఆయనను స్మరించుకొని అక్కడ పరిసరాలు శుభ్రం చేయించారు మంచు మనోజ్. మనోజ్ తోపాటు గీత ఆర్ట్స్ వెంటనే స్పందించింది దాసరి సమాధి పునరుద్ధరణ పనులు చేపట్టింది. దాసరి నారాయణరావు జ్ఞాపకాలను గౌరవిస్తూ చేపట్టిన ఈ చర్యల పట్ల అభిమానులు, ప్రేక్షకులు అభినందిస్తున్నారు.

ఇది కూడా చదవండి : Shruti Haasan: ఆ సాంగ్ వల్ల.. నన్ను ఇష్టపడని వారు కూడా నాకు ఫోన్ చేసి మెచ్చుకున్నారు..

దాసరి నారాయణరావు సమాధి శుభ్రం చేయించిన మంచు మనోజ్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us