AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణ వాసులకు గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు.. ఆ ఎయిర్‌ పోర్టు నిర్మాణాలపై కీలక ప్రకటన!

తెలంగాణ వాసులకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పాడు. 2028 జూన్ 2 నాటికి వరంగల్, ఆదిలాబాద్‌ ఎయిర్‌పోర్టు నిర్మాణాలు పూర్తి చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు. తాజాగా ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డితో జరిగిన భేటీ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

తెలంగాణ వాసులకు గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు.. ఆ ఎయిర్‌ పోర్టు నిర్మాణాలపై కీలక ప్రకటన!
Telangana Airport Development
Gopikrishna Meka
| Edited By: |

Updated on: Jul 14, 2026 | 2:09 PM

Share

తెలంగాణను ఆర్థికంగా, పారిశ్రామికంగా ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడుతో భేటీ అయ్యారు.. వరంగల్ (మామునూరు),ఆదిలాబాద్ విమానాశ్రయం పనులను వేగవంతం చేసేందుకు ఇరువురు నేతలు అంగీకారానికి వచ్చారు. 2028 జూన్ 2 నాటికి విమానాశ్రయాన్ని పూర్తి చేయడమే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని నిర్ణయించాయి.ఇప్పటికే మామునూరు ఎయిర్పోర్ట్ బౌండరీ వాల్, రన్‌వే పనులకు టెండర్లు సిద్ధమవ్వగా.. మరో 3-4 వారాల్లో టెర్మినల్ భవనం నిర్మాణానికి టెండర్లు పిలవనున్నారు.

కాకతీయ కళా వైభవాన్ని ప్రతిబింబించేలా, అంతర్జాతీయ ప్రమాణాలతో వరంగల్ ఎయిర్ పోర్టు టెర్మినల్ భవనాన్ని నిర్మించనున్నారు. ఎయిర్ పోర్టు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం రికార్డు సమయంలో 253 ఎకరాల భూమిని అప్పగించడాన్ని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కొనియాడారు. ఈ ప్రాజెక్టులో ఎలాంటి జాప్యం లేదని స్పష్టం చేశారు. తన హయంలోనే తెలంగాణలో ఎయిర్ పోర్టుల నిర్మాణం పూర్తవుతుందన్నారు.

మరోవైపు ఆదిలాబాద్‌ విమానాశ్రయాన్ని డిఫెన్స్-సివిలియన్ ఎయిర్‌పోర్ట్‌గా మార్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కసరత్తు చేస్తున్నాయి. దీని కోసం సుమారు 1,500 ఎకరాల భూసేకరణ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. రక్షణ శాఖ నుంచి అనుమతులు వచ్చిన తరువాత ఆదిలాబాద్ ఎయిర్ పోర్టు పనులు వేగవంతం అవుతాయని రామ్మోహన్ నాయుడు తెలిపారు.

భారత్‌ను ఏవియేషన్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం

ప్రధాని మోదీ నాయకత్వంలో దేశంలో రూ. 30 వేల కోట్లతో 100 కొత్త ఎయిర్‌పోర్టులు, 200 హెలిపోర్టులు నిర్మిస్తున్నారు. రూరల్ కనెక్టివిటీ పెంచేందుకు ఉడాన్ పథకాన్ని మరో 10 ఏళ్లు పొడిగించారు. అందులో భాగంగా తెలంగాణను గ్లోబల్ ఏవియేషన్ హబ్‌గా మార్చేందుకు కేంద్రం సంపూర్ణ సహకారం అందించనుంది. ఎన్డీఏ పాలిత రాష్ట్రాలను ఒకలా ఎన్డీఏలో లేని రాష్ట్రాలను ఒకలా చూడటం లేదని, దేశ అభివృద్ధి లక్ష్యంతో మంత్రిత్వ శాఖ పనిచేస్తుందని రామ్మోహన్ నాయుడు తెలిపారు

వికసిత తెలంగాణ లక్ష్యంగా పనిచేస్తున్నాం..రేవంత్ రెడ్డి

2029 జూన్ 2 నాటికి తెలంగాణలో వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్ పోర్టు పూర్తించేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు రేవంత్ రెడ్డి. రామ్మోహన్ నాయుడు తెలంగాణ ఎయిర్ పోర్టుల నిర్మాణానికి పూర్తి సహకారం అందిస్తున్నారన్నారు. అభివృద్దే లక్ష్యంగా కేంద్ర రాష్ట్రాల మధ్య సహకార స్పూర్తి కొనసాగుతున్నారు. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యంలో భాగంగా,తెలంగాణను 2034 నాటికి $1 ట్రిలియన్, 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీగా మార్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఈ ఫొటోలో ఉన్న కుర్రాడిని గుర్తుపట్టారా.?
ఈ ఫొటోలో ఉన్న కుర్రాడిని గుర్తుపట్టారా.?
మైగ్రేన్ తలనొప్పికి చెక్ పెట్టే అద్భుతమైన హెర్బల్ డ్రింక్!
మైగ్రేన్ తలనొప్పికి చెక్ పెట్టే అద్భుతమైన హెర్బల్ డ్రింక్!
ఐఫోన్‌ ధర అమెరికాలో చౌకగా ఉంటే భారత్‌లో ఎక్కువగా ఎందుకుంటుంది?
ఐఫోన్‌ ధర అమెరికాలో చౌకగా ఉంటే భారత్‌లో ఎక్కువగా ఎందుకుంటుంది?
తల్లి ఆస్తిపై కూతుళ్లకు హక్కు ఉంటుందా..?
తల్లి ఆస్తిపై కూతుళ్లకు హక్కు ఉంటుందా..?
టాస్ ఓడిన భారత్.. రెండు మార్పులతో బరిలోకి శ్రేయాస్ సేన
టాస్ ఓడిన భారత్.. రెండు మార్పులతో బరిలోకి శ్రేయాస్ సేన
రెండు ఓటీటీల్లో ట్రెండింగ్‌.. షేక్ చేస్తున్న తెలుగు మిస్టరీ థ్రిల
రెండు ఓటీటీల్లో ట్రెండింగ్‌.. షేక్ చేస్తున్న తెలుగు మిస్టరీ థ్రిల
ఇంటి పైకప్పుపై పక్షులకు ధాన్యం వేయవచ్చా?నిపుణులు ఏం చెబుతున్నారు!
ఇంటి పైకప్పుపై పక్షులకు ధాన్యం వేయవచ్చా?నిపుణులు ఏం చెబుతున్నారు!
బరువు తగ్గాలనుకునేవారికి నల్ల ఎండుద్రాక్ష మంచిదేనా?అసలు నిజం ఇదే!
బరువు తగ్గాలనుకునేవారికి నల్ల ఎండుద్రాక్ష మంచిదేనా?అసలు నిజం ఇదే!
మొక్కల్లోనూ ఆడ, మగ..? కొమ్మల్లో దాగున్న సృష్టి రహస్యం తెలిస్తే..
మొక్కల్లోనూ ఆడ, మగ..? కొమ్మల్లో దాగున్న సృష్టి రహస్యం తెలిస్తే..
పాక్‌లో రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలో ఎమర్జెన్సీ!
పాక్‌లో రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలో ఎమర్జెన్సీ!