AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ ఫొటోలో ఉన్న కుర్రాడిని గుర్తుపట్టారా.? ఇప్పుడు టాలీవుడ్‌లో ట్రెండింగ్ అతను

శ్రీకాంత్ తనయుడు రోషన్ ఇటీవలే ఛాంపియన్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. హీరోగా రోషన్ కు ఇది మూడో సినిమా.. మొదటి సినిమా నిర్మలాకాన్వెంట్ అనే సినిమా చేశాడు. కానీ ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఆ సినిమా సమయంలో రోషన్ చాలా చిన్నవాడు.

ఈ ఫొటోలో ఉన్న కుర్రాడిని గుర్తుపట్టారా.? ఇప్పుడు టాలీవుడ్‌లో ట్రెండింగ్ అతను
Tollywood
Rajeev Rayala
|

Updated on: Oct 11, 2026 | 6:53 PM

Share

సినిమా ఇండస్ట్రీలో స్టార్ కిడ్స్ ఎంట్రీ ఇవ్వడం కొత్తేమీ కాదు. అయితే చిన్నప్పుడు సినిమాల్లో కనిపించిన కొందరు నటులు, ఇప్పుడు హీరోలుగా మారి తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అలాంటి వారిలో ఒకరు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నారు. ఇంతకీ ఆయన ఎవరో గుర్తుపట్టారా.? శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించిన మూడో సినిమా ఛాంపియన్ మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. అయితే రోషన్ సినీ ప్రయాణం అంత సులభంగా మొదలుకాలేదు. 2015లో అనుష్క ప్రధాన పాత్రలో నటించిన రుద్రమదేవి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కనిపించాడు. ఆ తర్వాత 2016లో ‘నిర్మలా కాన్వెంట్’ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. నాగ కోటేశ్వరరావు దర్శకత్వం వహించిన ఈ టీనేజ్ లవ్ స్టోరీలో శ్రియా శర్మ హీరోయిన్‌గా నటించగా, అక్కినేని నాగార్జున కీలక పాత్ర పోషించారు.

ఒకప్పుడు టీవీ యాంకర్.. ఇప్పుడు ఇండస్ట్రీలోనే తోప్ హీరోయిన్.. హీరోలకు మించి క్రేజ్

ఈ సినిమాలో రోషన్ స్నేహితులుగా ఇద్దరు స్టార్ కిడ్స్ కూడా కనిపించారు. వారిలో ఒకరు స్టార్ యాంకర్ సుమ కనకాల కుమారుడు రోషన్ కనకాల కాగా, మరొకరు బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ తనయుడు చంద్రహాస్. సుమ కుమారుడు రోషన్ కనకాల బబుల్‌గమ్ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత మోగ్లీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరోవైపు చంద్రహాస్ సినిమాల్లోకి రాకముందే తనదైన యాటిట్యూడ్‌తో సోషల్ మీడియాలో పాపులర్ అయ్యాడు. రామ్ నగర్ బన్నీ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

ఇవి కూడా చదవండి

చిరు, బాలయ్యల, నాగ్, వెంకీలతో బ్లాక్ బస్టర్స్.. కట్ చేస్తే సినిమాలకు దూరం.. ఇప్పుడు ఇలా

ఇటీవల ‘బరాబర్ ప్రేమిస్తా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చంద్రహాస్, ప్రమోషన్ల సమయంలో పాటలో అసభ్య పదాలు ఉపయోగించడంతో వివాదంలో చిక్కుకున్నాడు. అయితే సినిమాలో తన డ్యాన్స్, నటనతోనూ ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ప్రస్తుతం తన తదుపరి సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఒకప్పుడు ‘నిర్మలా కాన్వెంట్’లో స్నేహితులుగా కనిపించిన ఈ ఇద్దరు నటులు, ఇప్పుడు హీరోలుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుండటం విశేషం.

Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని

View this post on Instagram

A post shared by Hasa (@chandrahasa1808)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఈ ఫొటోలో ఉన్న కుర్రాడిని గుర్తుపట్టారా.?
ఈ ఫొటోలో ఉన్న కుర్రాడిని గుర్తుపట్టారా.?
మైగ్రేన్ తలనొప్పికి చెక్ పెట్టే అద్భుతమైన హెర్బల్ డ్రింక్!
మైగ్రేన్ తలనొప్పికి చెక్ పెట్టే అద్భుతమైన హెర్బల్ డ్రింక్!
ఐఫోన్‌ ధర అమెరికాలో చౌకగా ఉంటే భారత్‌లో ఎక్కువగా ఎందుకుంటుంది?
ఐఫోన్‌ ధర అమెరికాలో చౌకగా ఉంటే భారత్‌లో ఎక్కువగా ఎందుకుంటుంది?
తల్లి ఆస్తిపై కూతుళ్లకు హక్కు ఉంటుందా..?
తల్లి ఆస్తిపై కూతుళ్లకు హక్కు ఉంటుందా..?
టాస్ ఓడిన భారత్.. రెండు మార్పులతో బరిలోకి శ్రేయాస్ సేన
టాస్ ఓడిన భారత్.. రెండు మార్పులతో బరిలోకి శ్రేయాస్ సేన
రెండు ఓటీటీల్లో ట్రెండింగ్‌.. షేక్ చేస్తున్న తెలుగు మిస్టరీ థ్రిల
రెండు ఓటీటీల్లో ట్రెండింగ్‌.. షేక్ చేస్తున్న తెలుగు మిస్టరీ థ్రిల
ఇంటి పైకప్పుపై పక్షులకు ధాన్యం వేయవచ్చా?నిపుణులు ఏం చెబుతున్నారు!
ఇంటి పైకప్పుపై పక్షులకు ధాన్యం వేయవచ్చా?నిపుణులు ఏం చెబుతున్నారు!
బరువు తగ్గాలనుకునేవారికి నల్ల ఎండుద్రాక్ష మంచిదేనా?అసలు నిజం ఇదే!
బరువు తగ్గాలనుకునేవారికి నల్ల ఎండుద్రాక్ష మంచిదేనా?అసలు నిజం ఇదే!
మొక్కల్లోనూ ఆడ, మగ..? కొమ్మల్లో దాగున్న సృష్టి రహస్యం తెలిస్తే..
మొక్కల్లోనూ ఆడ, మగ..? కొమ్మల్లో దాగున్న సృష్టి రహస్యం తెలిస్తే..
పాక్‌లో రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలో ఎమర్జెన్సీ!
పాక్‌లో రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలో ఎమర్జెన్సీ!