AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రెండు ఓటీటీల్లో ట్రెండింగ్‌.. షేక్ చేస్తున్న తెలుగు మిస్టరీ థ్రిల్లర్.. థియేటర్స్‌లో ఎలా మిస్ అయ్యాం..!

ప్రజెంట్ ఓటీటీల్లో క్రైమ్ స్టోరీస్, సస్పెన్స్, హారర్, థ్రిల్లర్‌ చిత్రాలకు మంచి ఆదరణ ఉంటోంది. అందులోనూ మలయాళం సినిమాలైతే మరీ డిమాండ్ ఉంటోంది. అందుకే అక్కడ హిట్ అయిన సినిమాలు, వెబ్ సిరీస్ లను డబ్బింగ్ చేసి మరీ తెలుగులోనూ స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నారు. అలాగే కొన్ని తెలుగు థ్రిల్లర్ సినిమాలు కూడా వైరల్ అవుతున్నాయి.

రెండు ఓటీటీల్లో ట్రెండింగ్‌.. షేక్ చేస్తున్న తెలుగు మిస్టరీ థ్రిల్లర్.. థియేటర్స్‌లో ఎలా మిస్ అయ్యాం..!
Ott Movie
Rajeev Rayala
|

Updated on: Oct 11, 2026 | 6:27 PM

Share

థియేటర్లలో విడుదలైనప్పుడు పెద్దగా ప్రచారం పొందని కొన్ని సినిమాలు.. ఓటీటీలోకి వచ్చాక మంచి ఆదరణ సొంతం చేసుకుంటాయి. ఇప్పుడు ‘మారెమ్మ’ సినిమా కూడా ఇదే కోవలోకి చేరింది. ఆహా వీడియో, జియోహాట్‌స్టార్‌ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన మైథలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ కావడంతో నెటిజన్లు ఈ సినిమాపై ఆసక్తి చూపిస్తున్నారు. మాస్ మహారాజా రవితేజ సోదరుడు రఘు తనయుడు మాధవ్ భూపతిరాజు ఈ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఇందులో దీపా బాలు హీరోయిన్‌గా నటించింది. వికాస్ వశిష్ట, సీనియర్ నటుడు వినోద్ కుమార్, వీఎస్ రూపాలక్ష్మి, దయానంద్ రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. ఈ చిత్రానికి మంచాల నాగరాజు దర్శకత్వం వహించగా.. మోక్ష ఆర్ట్స్ బ్యానర్‌పై మయూర్ రెడ్డి బండారు నిర్మించారు. ప్రశాంత్ ఆర్. విహారి అందించిన నేపథ్య సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఒకప్పుడు టీవీ యాంకర్.. ఇప్పుడు ఇండస్ట్రీలోనే తోప్ హీరోయిన్.. హీరోలకు మించి క్రేజ్

మహిషాపురం అనే మారుమూల పల్లెటూరి నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. గ్రామంలో ఏదైనా అనర్థం జరిగితే అది గ్రామదేవత మారెమ్మ ఆగ్రహమేనని అక్కడి ప్రజలు నమ్ముతుంటారు. అమ్మవారిని శాంతింపజేయడానికి ఓ దున్నపోతును ఆమె పేరుతో వదిలి, నిర్ణీత సమయంలో బలి ఇచ్చే సంప్రదాయం ఉంటుంది. అదే గ్రామంలో కర్ణి అనే యువకుడు ‘మారి’ అనే దున్నపోతును ఎంతో ప్రేమగా పెంచుకుంటాడు. అయితే గ్రామంలో అనూహ్య సంఘటనలు, వరుస మరణాలు చోటుచేసుకుంటున్న సమయంలో అమ్మవారికి సమర్పించాల్సిన దున్నపోతు కనిపించకుండా పోతుంది. దీంతో గ్రామస్తుల్లో భయం మొదలవుతుంది. అసలు గ్రామంలో జరుగుతున్న పరిణామాలకు కారణం దైవ ఆగ్రహమా? లేక వీటి వెనుక మరేదైనా రహస్యం ఉందా? తన దున్నపోతును కాపాడుకోవడానికి కర్ణి ఏం చేశాడు? అనే ప్రశ్నల చుట్టూ కథ ఆసక్తికరంగా సాగుతుంది. ముఖ్యంగా ద్వితీయార్థంలోని మలుపులు ప్రేక్షకుల్లో ఉత్కంఠను పెంచుతాయి.

చిరు, బాలయ్యల, నాగ్, వెంకీలతో బ్లాక్ బస్టర్స్.. కట్ చేస్తే సినిమాలకు దూరం.. ఇప్పుడు ఇలా

గ్రామీణ వాతావరణం, స్థానిక ఆచారాలు, మూఢనమ్మకాలు, మిస్టరీ అంశాలను కలిపి ఈ సినిమాను తెరకెక్కించారు. హీరోగా పరిచయమైన మాధవ్ భూపతిరాజు తన పాత్రకు తగ్గట్టుగా నటించాడు. ప్రశాంత్ ఆర్. విహారి నేపథ్య సంగీతం ఉత్కంఠభరిత సన్నివేశాలకు మరింత బలాన్ని ఇచ్చింది. రూరల్ మిస్టరీలు, హారర్ ఛాయలున్న కథలు, థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారికి ‘మారెమ్మ’ మంచి ఎంపికగా నిలుస్తోంది. థియేటర్లలో ఈ సినిమాను చూడలేకపోయిన ప్రేక్షకులు ఇప్పుడు ఓటీటీలో వీక్షిస్తూ తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ఆహా వీడియో, జియోహాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది.

ఇవి కూడా చదవండి

Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us