Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని
జబర్దస్త్ కామెడీ షోతో ఎంతో మంది మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ కామెడీ షోలో కంటెస్టెంట్ గా, టీమ్ లీడర్స్ గా పనిచేసిన వారు ఇప్పుడు సినిమాలతో బిజీ బిజీగా ఉంటున్నారు. కమెడియన్లుగా, నటీనటులుగా, డైరెక్టర్లుగా, నిర్మాతలుగా సత్తా చాటుతున్నారు .

బుల్లితెరపై ఎంతోమంది కమెడియన్లు ప్రేక్షకులను నవ్విస్తుంటారు. కానీ కొందరు మాత్రమే తమదైన శైలితో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారు. అలాంటి వారిలో జబర్దస్త్ వినోద్ ఒకరు. లేడీ గెటప్‌లో వినోదిని పేరుతో ప్రేక్షకులకు దగ్గరైన ఆయన.. తన కామెడీతో ఎంతో మందిని కడుపుబ్బా నవ్వించారు. అయితే తెరపై నవ్వులు పంచే వినోద్ జీవితంలో ఎన్నో అనుభవాలు, సవాళ్లు ఉన్నాయట. గతంలో ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్, కుటుంబం, వ్యక్తిగత జీవితం, భవిష్యత్తు లక్ష్యాల గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. జబర్దస్త్ వినోద్‌కు మొదటి నుంచి యాంకరింగ్ అంటే ఎంతో ఇష్టమట. అదే ఆశయంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం పలు పబ్లిక్, ప్రైవేట్, కార్పొరేట్ కార్యక్రమాలకు హోస్ట్‌గా వ్యవహరిస్తూనే సినిమాల్లోనూ నటిస్తున్నారు. అయితే తనకు ఇంతటి గుర్తింపు రావడంలో జబర్దస్త్ కీలక పాత్ర పోషించిందని వినోద్ తెలిపారు.
బిగ్ బాస్ వల్ల నాపై నీచంగా కామెంట్స్ చేశారు.. తట్టుకోలేక వెక్కి వెక్కి ఏడ్చేశా
జబర్దస్త్ షో తన జీవితాన్ని మలుపు తిప్పిందని, ఈ కార్యక్రమం ద్వారానే ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యానని తెలిపారు. ఒకవేళ జబర్దస్త్ తన జీవితంలోకి రాకపోయి ఉంటే బ్యాంకింగ్ లేదా సాఫ్ట్‌వేర్ రంగంలో స్థిరపడేవాడినేమోనని అన్నారు. ఎంసెట్‌లో మంచి ర్యాంకు సాధించ కాబట్టి పశువైద్యుడిగా మారే అవకాశం కూడా ఉండేదని గుర్తుచేసుకున్నారు. అయితే తనలోని మాట్లాడే స్వభావం, కళారంగంపై ఉన్న ఆసక్తి చివరకు తనను ఇండస్ట్రీ వైపు నడిపించాయని వివరించారు.
టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్.. స్టార్ హీరోలతో ఎన్నో సినిమాలు.. కానీ చిరంజీవితో మాత్రం నటించలేదు!
సినిమాల్లో హీరోగా ఎదగాలనే లక్ష్యం తనకు లేదని వినోద్ స్పష్టం చేశారు. మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకోవడమే తనకు ముఖ్యమని తెలిపారు. తన నటనను గుర్తించి దర్శకులు ప్రత్యేకంగా పాత్రలు సృష్టించే స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి షార్ట్‌కట్‌లను నమ్మనని, కష్టపడుతూ ముందుకు సాగడమే తనకు ఇష్టమని వినోద్ పేర్కొన్నారు. విధిలో ఏది రాసి ఉంటే అది తప్పకుండా జరుగుతుందనే నమ్మకం తనకు ఉందని అన్నారు. తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ నటుడిగా మరింత మంచి గుర్తింపు తెచ్చుకోవాలని భావిస్తున్నట్లు వెల్లడించారు.
ఇంతకాలం ఆయనతో సినిమా చేయకుండా ఎందుకు ఉన్నానా అనిపించింది: పూరి జగన్నాథ్
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



