AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మైగ్రేన్ దీర్ఘకాలిక తలనొప్పికి చెక్ పెట్టే అద్భుతమైన హెర్బల్ డ్రింక్!

దీర్ఘకాలిక మైగ్రేన్ సమస్యతో బాధపడేవారికి వంటింట్లో లభించే సహజ సిద్ధమైన పదార్థాలతో తయారుచేసే హెర్బల్ డ్రింక్ అద్భుతమైన ఉపశమనాన్ని ఇస్తుంది. మైగ్రేన్ నొప్పులు తీవ్రంగా ఉన్నప్పుడు లేదా రోజువారీ ఉదయం ఈ హెర్బల్ టీని తీసుకోవడం ద్వారా ఒత్తిడి తగ్గి తలనొప్పి నుండి త్వరగా ఉపశమనం పొందవచ్చు. కెమికల్స్ లేని ఈ సహజ పద్ధతి ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా దీర్ఘకాలిక ప్రయోజనాలను అందిస్తుంది.

మైగ్రేన్ దీర్ఘకాలిక తలనొప్పికి చెక్ పెట్టే అద్భుతమైన హెర్బల్ డ్రింక్!
Herbal Drink For Migraine
Jyothi Gadda
|

Updated on: Oct 11, 2026 | 7:13 PM

Share

నేటి ఉరుకులు పరుగుల జీవితంలో ఒత్తిడి, సరిగ్గా నిద్రపోకపోవడం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగా చాలామందిని తీవ్రమైన మైగ్రేన్ సమస్య వేధిస్తోంది. తల ఒక వైపు విపరీతంగా లాగడం, వాంతులు రావడం వంటి లక్షణాలతో బాధపడేవారు రోజూ పెయిన్ కిల్లర్స్ వాడటం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. కాబట్టి, దీనికి సహజమైన పరిష్కారంగా వంటింట్లో లభించే పదార్థాలతో ఒక శక్తివంతమైన హెర్బల్ డ్రింక్ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

ఆయుర్వేద నిపుణుల ప్రకారం, సహజ మూలికల్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్త నాళాల్లో వాపును తగ్గించి, మెదడుకు సక్రమంగా రక్త ప్రసరణ జరిగేలా చేస్తాయి. దీనివల్ల తలనొప్పి తీవ్రత క్రమంగా తగ్గుతుంది.

హెర్బల్ డ్రింక్ తయారీకి కావలసిన పదార్థాలు ఒక చిన్న అల్లం తురుము. ఇది నొప్పులను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. గుప్పెడు తాజా పుదీనా ఆకులు. మనసుకు ప్రశాంతతను ఇస్తాయి. చిటికెడు దాల్చినచెక్క పొడి. రుచికి తగినట్లుగా కొద్దిగా తేనె ఇది మీ ఆప్షనల్.

ఇవి కూడా చదవండి

ఇక తయారు చేసే విధానంలోకి వెళ్తే.. ఒక గిన్నెలో ఒకటిన్నర గ్లాసు నీటిని తీసుకోవాలి. అందులో అల్లం తురుము, పుదీనా ఆకులు వేసి బాగా మరిగించాలి. నీరు సగానికి తగ్గిన తర్వాత దాల్చినచెక్క పొడిని కలపాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని వడకట్టి, గోరువెచ్చగా ఉన్నప్పుడు కొద్దిగా తేనె కలుపుకొని త్రాగాలి.

ఈ డ్రింక్ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు:

ఈ హెర్బల్ టీని రోజూ ఉదయం పరగడుపున లేదా మైగ్రేన్ నొప్పి ప్రారంభమవుతుంది అనిపించినప్పుడు త్రాగితే తక్షణ ఉపశమనం లభిస్తుంది. ఇది నాడీ వ్యవస్థను రిలాక్స్ చేసి ఒత్తిడిని దూరం చేస్తుంది. అయితే, సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు నిపుణుల సలహా తీసుకోవడం ఎల్లప్పుడూ మంచిది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
స్టార్ హీరో సినిమాలో రోల్ అని చెప్పి మోసం చేశారు..
స్టార్ హీరో సినిమాలో రోల్ అని చెప్పి మోసం చేశారు..
ఈ ఫొటోలో ఉన్న కుర్రాడిని గుర్తుపట్టారా.?
ఈ ఫొటోలో ఉన్న కుర్రాడిని గుర్తుపట్టారా.?
మైగ్రేన్ తలనొప్పికి చెక్ పెట్టే అద్భుతమైన హెర్బల్ డ్రింక్!
మైగ్రేన్ తలనొప్పికి చెక్ పెట్టే అద్భుతమైన హెర్బల్ డ్రింక్!
ఐఫోన్‌ ధర అమెరికాలో చౌకగా ఉంటే భారత్‌లో ఎక్కువగా ఎందుకుంటుంది?
ఐఫోన్‌ ధర అమెరికాలో చౌకగా ఉంటే భారత్‌లో ఎక్కువగా ఎందుకుంటుంది?
తల్లి ఆస్తిపై కూతుళ్లకు హక్కు ఉంటుందా..?
తల్లి ఆస్తిపై కూతుళ్లకు హక్కు ఉంటుందా..?
టాస్ ఓడిన భారత్.. రెండు మార్పులతో బరిలోకి శ్రేయాస్ సేన
టాస్ ఓడిన భారత్.. రెండు మార్పులతో బరిలోకి శ్రేయాస్ సేన
రెండు ఓటీటీల్లో ట్రెండింగ్‌.. షేక్ చేస్తున్న తెలుగు మిస్టరీ థ్రిల
రెండు ఓటీటీల్లో ట్రెండింగ్‌.. షేక్ చేస్తున్న తెలుగు మిస్టరీ థ్రిల
ఇంటి పైకప్పుపై పక్షులకు ధాన్యం వేయవచ్చా?నిపుణులు ఏం చెబుతున్నారు!
ఇంటి పైకప్పుపై పక్షులకు ధాన్యం వేయవచ్చా?నిపుణులు ఏం చెబుతున్నారు!
బరువు తగ్గాలనుకునేవారికి నల్ల ఎండుద్రాక్ష మంచిదేనా?అసలు నిజం ఇదే!
బరువు తగ్గాలనుకునేవారికి నల్ల ఎండుద్రాక్ష మంచిదేనా?అసలు నిజం ఇదే!
మొక్కల్లోనూ ఆడ, మగ..? కొమ్మల్లో దాగున్న సృష్టి రహస్యం తెలిస్తే..
మొక్కల్లోనూ ఆడ, మగ..? కొమ్మల్లో దాగున్న సృష్టి రహస్యం తెలిస్తే..