Manchu Lakshmi: ఎన్టీఆర్‌ ఘనతను ఎందుకు సెలబ్రేట్‌ చేసుకోరు? షాకింగ్‌ కామెంట్స్‌ చేసిన మంచు లక్ష్మి

|

Jan 08, 2023 | 11:58 AM

వెరైటీ మ్యాగజైన్ టాప్ 10 బెస్ట్ యాక్టర్ ప్రిడిక్షన్స్ ఫర్ ఆస్కార్స్ రేస్ లో ఎన్టీఆర్‌ పదో స్థానంలో నిలిచారు. తద్వారా మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఒక భారతీయ నటుడు టాప్ 10 ఆస్కార్ ఉత్తమ నటుల జాబితాలో చోటు సంపాదించడం ఇదే తొలిసారి.

Manchu Lakshmi: ఎన్టీఆర్‌ ఘనతను ఎందుకు సెలబ్రేట్‌ చేసుకోరు? షాకింగ్‌ కామెంట్స్‌ చేసిన మంచు లక్ష్మి
Jr Ntr, Manchu Lakshmi
Follow us on

దర్శక ధీరుడు ఎస్‌ ఎస్‌ రాజమౌళి తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంతో పాన్‌ ఇండియా హీరోగా మారిపోయాడు ఎన్టీఆర్‌. ఈ చిత్రంలో తారక్‌ అభినయానికి అందరూ ముగ్ధులయ్యారు. ముఖ్యంగా కొమురం భీముడో సాంగ్‌లో ఎన్టీఆర్‌ నటన అందరినీ కంటతడిపెట్టించింది. ప్రపంచవ్యాప్తంగా పలువురి ప్రముఖులు తారక్‌ నటనపై ప్రశంసలు కురిపించారు. ఇక కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్వయంగా హైదరాబాద్ వచ్చి మరీ ఎన్టీఆర్ ని కలిసి అభినందించారు. ఇక అవార్డుల సంగతైతే చెప్పనక్కర్లేదు. ఈక్రమంలో వెరైటీ మ్యాగజైన్ టాప్ 10 బెస్ట్ యాక్టర్ ప్రిడిక్షన్స్ ఫర్ ఆస్కార్స్ రేస్ లో ఎన్టీఆర్‌ పదో స్థానంలో నిలిచారు. తద్వారా మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఒక భారతీయ నటుడు టాప్ 10 ఆస్కార్ ఉత్తమ నటుల జాబితాలో చోటు సంపాదించడం ఇదే తొలిసారి. దీంతో తారక్‌కు ఆస్కార్ రావడం పక్కా అంటూ నందమూరి అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. అటు అభిమాన వర్గాలు, మీడియా సంస్థలు ఎన్టీఆర్ ని తెగ పొగిడేస్తున్నాయి. అయితే ఈ విషయమై సినీ సెలబ్రిటీలు పెద్దగా స్పందించలేదు. తారక్‌కు కనీసం కంగ్రాట్స్‌ కూడా చెప్పలేకపోయారు. ఇప్పుడిదే విషయంపై స్పందించిన మంచు లక్ష్మి సోషల్‌ మీడియా వేదికగా షాకింగ్‌ కామెంట్స్ చేసింది.

‘ఎన్టీఆర్ సాధించిన ఘనత చిన్న విషయమేమీ కాదు. ప్రపంచ సినిమా చరిత్రలోనే పెద్ద విజయం ఇది. దీన్ని మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకోవడం లేదు? అంతా ఎందుకు మౌనంగా ఉన్నారు. తారక్ సాధించిన ఈ ఘనతకు మీ నుంచి విజిల్స్, చప్పట్లు రావాలి’ అంటూ ట్వీట్ చేసింది మంచువారమ్మాయి. ప్రస్తుతం ఈ పోస్ట్‌ టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ ట్వీట్ చూసిన ఎన్టీఆర్‌ అభిమానులు.. ఇది నిజమే కదా.. తారక్ సాధించిన ఘనత చిన్న విషయం కాదు. ఇది నిజంగా గర్వించదగ్గ విషయం అని కామెంట్లు చేస్తున్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో ఎన్టీఆర్‌ భీమ్‌ అనే క్యారెక్టర్‌లో కనిపించాడు. రామ్‌ చరణ్‌ అల్లూరి సీతారామారాజు పాత్రలో సందడి చేశాడు. ఇద్దరూ కలిసి పోటాపోటీగా నటిపించడంతో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకు అంతర్జాతీయంగా అవార్డుల పంట పండుతోంది

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.