Manchu Lakshmi: ‘ఓ ఫ్యామిలీని బాధ పెట్టారు’.. క్షమాపణలు చెప్పాల్సిందేనంటోన్న మంచు లక్ష్మి.. ఏమైందంటే?

|

Mar 24, 2025 | 9:54 PM

మంచు వారమ్మాయి మంచు లక్ష్మి ఇప్పుడు సినిమాలు, టీవీ షోస్ లోనూ పెద్దగా కనిపించడం లేదు. కేవలం సోషల్ మీడియా ద్వారా మాత్రమే అభిమానులతో టచ్ లో ఉంటోంది. అలా తాజాగా మంచు లక్ష్మి షేర్ చేసిన ఓ పోస్ట్ వైరల్ గా మారింది.

Manchu Lakshmi: ఓ ఫ్యామిలీని బాధ పెట్టారు.. క్షమాపణలు చెప్పాల్సిందేనంటోన్న మంచు లక్ష్మి.. ఏమైందంటే?
Manchu Lakshmi
Follow us on

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో హీరోయిన్ రియా చక్రవర్తిపై పలు సంచలన ఆరోపణలు వచ్చాయి . ఈ కేసును దర్యాప్తు చేసిన సీబీఐ ఇప్పుడు తన తుది నివేదికను కోర్టుకు సమర్పించింది. ఈ నివేదికలో రియా చక్రవర్తికి క్లీన్ చిట్ ఇచ్చింది. సుశాంత్ మరణంలో రియా చక్రవర్తి ఎలాంటి పాత్ర లేదని కరాఖండిగా చెప్పేశారు. దీంతో రియాకు భారీ ఊరట లభించినట్లయింది. ఆమెతో పాటు కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులందరూ కూడా రియా విషయంలో ఎంతో సంతోషంగా ఫీలవుతున్నారు. ఈ క్రమంలోనే రియా చక్రవర్తిని ఉద్దేశించి టాలీవుడ్ నటి మంచు లక్ష్మి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేసింది. సుశాంత్ డెత్ కేసులో ఐదేళ్లుగా రియా అనుభవించిన బాధని, పోరాటాన్ని గుర్తు చేస్తూ మంచు వారమ్మాయి షేర్ చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరలవుతోంది.

‘సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసులో రియా చక్రవర్తికి, ఆమె కుటుంబానికి క్లీన్‌ చిట్‌ వచ్చింది. ఇలాంటి రోజొకటి వస్తుందని నాకు ముందుగానే తెలుసు. ఎందుకంటే నిజం ఎంతో కాలం దాగదు.. కాస్త ఆలస్యమైనా సరే బయటకు రాక తప్పదు. ఈ విషయంలో రియా, ఆమె కుటుంబం.. భరించలేని బాధను అనుభవించింది. సమాజం మిమ్మల్ని తప్పని నిందిస్తుంటే, మీతో క్రూరంగా రాక్షసంగా ప్రవర్తిస్తుంటే మీరు (రియా) పోరాడిన విధానం నిజంగా అద్భుతం. మిమ్మల్ని అవమానించారు, చీల్చి చెండాడారు. అయినా ఎంతో హుందాగా నిలబడ్డారు. ముందుకు సాగారు. ఈ విషయంలో నిజానిజాలు తెలుసుకోకుండా మీపై నోరు పారేసుకున్నవారు ఇప్పుడైనా ఆత్మవిమర్శ చేసుకోవాలి. క్షమాపణలు చెప్పాలి. అన్యాయంగా ఒక కుటుంబాన్ని ఎంత బాధపెట్టారో గుర్తు చేసుకుని పశ్చాత్తాపపడాలి. రియా.. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది. నీకు మరింత శక్తి చేకూరాలి. ఇది ఒక ఆరంభం మాత్రమే.. ఇకపై అంతా మంచే జరుగుతుంది. నువ్వు అనుభవిస్తున్న బాధ ఇప్పటికైనా తగ్గుతుందని నేను మనసారా ఆశిస్తున్నాను’ అని రాసుకొచ్చింది మంచు లక్ష్మి. ఇక తన పోస్టుకు #Justice, #TruthWins, #RheaChakraborty అన్న హ్యాష్‌ట్యాగ్స్‌ కూడా ఇచ్చింది.

ఇవి కూడా చదవండి

రియా కు మద్దతుగా విద్యా బాలన్, మంచు లక్ష్మి తదితర సెలబ్రిటీల పోస్టులు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.