Manchu Lakshmi: మీ మీద గౌరవం పెరిగింది మేడమ్.. మంచు లక్ష్మి చేస్తోన్న గొప్ప పనికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే

గత కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న మంచు వారమ్మాయి సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటోంది. ముఖ్యంగా భావి భారత పౌరులైన విద్యార్థుల బంగారు భవిష్యత్ కోసం టీచ్ ఫర్ చేంజ్ అనే ఎన్జీవో ద్వారా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేస్తోంది.

Manchu Lakshmi: మీ మీద గౌరవం పెరిగింది మేడమ్.. మంచు లక్ష్మి చేస్తోన్న గొప్ప పనికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే
Manchu Lakshmi

Updated on: Jul 23, 2025 | 5:58 PM

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నట వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది మంచు లక్ష్మి. నటిగా, నిర్మాతగా, హోస్ట్ గా, సింగర్ గా ఇలా ఎన్నో రంగాల్లో తన ప్రతిభను చాటుకుంది. అయితే గత కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటోంది మంచు లక్ష్మి. తన నివాసాన్ని ముంబైకు మార్చుకుంది. అయితే ఈ మంచు వారమ్మాయి ఓ మంచి పనికి శ్రీకారం చుట్టింది. టీచ్‌ ఫర్‌ ఛేంజ్‌ అనే స్వచ్చంద సంస్థను స్థాపించి పలు ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుంటోంది. ఈ స్కూళ్లలోని క్లాసులను డిజిటల్ క్లాస్ రూమ్స్ గా తీర్చిదిద్దుతోంది. తన సొంత డబ్బులతో టీవీ తదితర సౌకర్యాలు ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని వందలాది ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకున్న ఆమె వేలాది మంది విద్యార్థులకు స్మార్ట్‌ క్లాస్‌ ఎడ్యుకేషన్ ను అందిస్తోంది.

తాజాగా నెల్లూరు జిల్లాలో పర్యటించింది మంచు లక్ష్మి. ఈ జిల్లాలోని ఏకంగా 12 గవర్నమెంట్ స్కూళ్లలో డిజిటల్ క్లాస్ రూమ్ ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా కోటమిట్ట కృష్ణ మందిరం వీధిలోని మున్సిపల్ కార్పొరేషన్ ప్రైమరీ స్కూల్ కి వెళ్ళిన మంచు లక్ష్మికి అక్కడి విద్యార్థులు పూలు చల్లి స్వాగతం పలికారు. అనంతరం సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కుమారుడు సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోడలు శృతి రెడ్డిలతో కలిసి డిజిటల్ క్లాస్ రూమ్లను ప్రారంభించింది. అనంతరం అక్కడి విద్యార్థులతో సరదాగా ముచ్చటించింది. డిజిటల్ ఎడ్యుకేషన్ ప్రాముఖ్యతను స్టూడెంట్స్ కు వివరించింది.

ఇవి కూడా చదవండి

డిజటల్ క్లాస్ రూమ్స్ ను ప్రారంభిస్తోన్న మంచు లక్ష్మి..

ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం హిందీలో ‘ద ట్రైటర్స్’ అనే షోలో పాల్గొంది మంచు లక్ష్మి. ఇది అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఆమె నటించిన దక్ష.. ద డెడ్లీ కాన్‌స్పిరసి అనే సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. ఇందులో పోలీస్ పాత్రలో కనిపించనుంది మంచు వారమ్మాయి. త్వరలోనే ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

పూలు చల్లి మంచు లక్ష్మిక స్వాగతం పలికిన విద్యార్థులు.. వీడియో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.