Mohan Babu : నటుడు మోహన్ బాబు ఇంట్లో దొంగతనం.. భారీగా నగదు చోరీ..

హైదరాబాద్ శివారులోని జల్ పల్లి‌లో ఉన్న మోహన్ బాబు ఇంట్లో దొంగతనం జరిగిందని తెలుస్తోంది. ఆయన ఇంట్లో పని చేస్తున్న నాయక్ అనే వ్యక్తి డబ్బును దొంగిలించాడు. రూ. 10 లక్షల రూపాయిల డబ్బును దొంగలించి పారిపోయాడని తెలుస్తోంది.

Mohan Babu : నటుడు మోహన్ బాబు ఇంట్లో దొంగతనం.. భారీగా నగదు చోరీ..
Mohan Babu
Follow us

|

Updated on: Sep 25, 2024 | 3:30 PM

సీనియర్ నటుడు , కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇంట్లో దొంగతనం జరిగింది. ఇంట్లో పని చేస్తున్న వ్యక్తే దొంగతనం చేశాడని తెలుస్తోంది. హైదరాబాద్ శివారులోని జల్ పల్లి‌లో ఉన్న మోహన్ బాబు ఇంట్లో దొంగతనం జరిగిందని తెలుస్తోంది. ఆయన ఇంట్లో పని చేస్తున్న నాయక్ అనే వ్యక్తి డబ్బును దొంగిలించాడు. రూ. 10 లక్షల రూపాయిల డబ్బును దొంగలించి పారిపోయాడని తెలుస్తోంది. కాగా దొంగతనం జరగడంతో మోహన్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇది కూడా చదవండి : బాబోయ్..! ఏంటీ ఈమె మర్యాద రామన్న హీరోయినా..! ఎంత మారిపోయింది.!!

నిన్న రాత్రి( మంగళవారం) రాచకొండ సీపీకి మోహన్ బాబు ఫిర్యాదు చేసారు. దీంతో ఈ కేసులో వెంటనే స్పందించి దర్యాప్తు చేశారు. కాగా తిరుపతిలో ఇవాళ ఉదయం మోహన్ బాబు ఇంటి పనిమనిషి(ఎవరైతే దొంగతనం చేశాడో) నాయక్ ను పట్టుకున్నారు రాచకొండ పోలీసులు. ప్రస్తుతం అతన్ని హైదరాబాద్ కి తరలిస్తున్నారు.

ఇది కూడా చదవండి :ఇదేందయ్యా ఇది..! ఈ టాలీవుడ్ విలన్.. ఒకప్పటి స్టార్ హీరోయిన్ అంజలా జవేరి భర్తా.!!

ఇక మోహన్ బాబు ప్రస్తుతం కన్నప్ప సినిమాలో నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాను నిర్మిస్తున్నారు కూడా.. ఈ సినిమాలో మంచు విష్ణు హీరోగా నటిస్తున్నాడు. హిస్టారికల్ కంటెంట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో చాలా మంది స్టార్స్ నటిస్తున్నారు. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్‌తో పాటు టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా అతిథి పాత్రలో కనిపించనున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.