AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Renu Desai: మహిళల పట్ల అనుచిత కామెంట్స్ చేస్తే మీ పని అంతే.. రేణు దేశాయ్ విషయంలో ఏం జరిగిందంటే..

టాలీవుడ్ నటి రేణు దేశాయ్‌పై సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లాకు చెందిన చెన్నయ్య రుంజాలా అనే వ్యక్తి యూట్యూబ్‌లో నటి వీడియోను చూసిన తర్వాత తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.

Renu Desai: మహిళల పట్ల అనుచిత కామెంట్స్ చేస్తే మీ పని అంతే.. రేణు దేశాయ్ విషయంలో ఏం జరిగిందంటే..
Renu Desai
Vijay Saatha
| Edited By: |

Updated on: Apr 09, 2026 | 1:47 PM

Share

టాలీవుడ్ నటి రేణు దేశాయ్‌పై సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన నిందితుడు సోషల్ మీడియా వేదికగా దూషణలకు పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు అతడిని అరెస్ట్ చేసి విచారణ కొనసాగిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నయ్య రుంజాలా అనే వ్యక్తి యూట్యూబ్‌లో నటి వీడియోను చూసిన తర్వాత తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు గుర్తించారు. ఈ పోస్టులు వైరల్ కావడంతో సైబర్ క్రైమ్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. డిజిటల్ ఆధారాలను సేకరించి నిందితుడి వివరాలను గుర్తించిన పోలీసులు అతడిని ట్రేస్ చేసి పట్టుకున్నారు. గుంటూరులో నిందితుడిని అదుపులోకి తీసుకున్న అనంతరం, అతడిని గచ్చిబౌలిలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రస్తుతం అతడిపై సంబంధిత చట్టాల కింద కేసులు నమోదు చేసి మరింత లోతైన విచారణ కొనసాగిస్తున్నారు. సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు, దూషణలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ ఘటనతో సోషల్ మీడియాలో బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని అధికారులు సూచిస్తున్నారు. వ్యక్తుల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేస్తున్నారు.

పోలీసులు చర్యలు తీసుకున్న విషయాన్ని స్వయంగా రేణు దేశాయ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ, సైబర్ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్టులో ఆమె “గుంటూరు నుంచి మరో వ్యక్తిని ఈ రోజు అరెస్ట్ చేశారు. ఆన్‌లైన్ దూషణలు ఇకపై సహించబడవు అన్న విషయాన్ని నిజం చేస్తూ ఈ చర్య తీసుకున్న సైబర్ పోలీసులకు హృదయపూర్వక ధన్యవాదాలు” అని పేర్కొన్నారు. ఈ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

పోలీసుల సమాచారం ప్రకారం.. గుంటూరు ప్రాంతానికి చెందిన చెన్నయ్య రుంజాలా అనే వ్యక్తి యూట్యూబ్‌లో నటి వీడియోపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, డిజిటల్ ఆధారాల ఆధారంగా నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని హైదరాబాద్‌కు తరలించి విచారణ కొనసాగిస్తున్నారు. ఇక సైబర్ నేరాలపై అవగాహన పెంచే దిశగా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు, వేధింపులు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఇటువంటి ఘటనలు ఎదురైతే స్థానిక పోలీస్ స్టేషన్‌లో లేదా జాతీయ హెల్ప్‌లైన్ 1930 ద్వారా ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.

Renu Desai

Renu Desai

Follow Us