Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nayanthara: నయనతార చెప్పిందని సాంగ్‌లో నా పార్ట్ తీసేశారు.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

ధనుష్‌కి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో నయనతార బహిరంగ లేఖ విడుదల చేయడంతో సమస్య మొదలైంది. నయనతార పెళ్లి డాక్యుమెంటరీ 'నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్'లో నానుమ్ రౌడీ థాన్‌లోని కొన్ని సన్నివేశాలను ఉపయోగించుకోవడానికి ధనుష్ ఎన్‌ఓసి ఇవ్వలేదని నయన్ ఆరోపించింది.

Nayanthara: నయనతార చెప్పిందని సాంగ్‌లో నా పార్ట్ తీసేశారు.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
Nayanthara
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 23, 2024 | 10:55 AM

నయనతార, ధనుష్ వ్యవహారం రోజు రోజుకు ముదురుతోంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన నయనతార, ధనుష్ గురించే మాట్లాడుకుంటున్నారు. కొంతమంది నయనతారకు మద్దతు తెలుపుతుంటే.. మరికొంతమంది ధనుష్ కు సపోర్ట్ చేస్తున్నారు. రీసెంట్ గా ఓ పెళ్లిలో ఈ ఇద్దరూ ఎడమొహం పెడమొహంగా కనిపించారు. ధనుష్‌కి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో నయనతార బహిరంగ లేఖ విడుదల చేయడంతో సమస్య మొదలైంది. నయనతార పెళ్లి డాక్యుమెంటరీ ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’లో నానుమ్ రౌడీ థాన్‌లోని కొన్ని సన్నివేశాలను ఉపయోగించుకోవడానికి ధనుష్ ఎన్‌ఓసి ఇవ్వలేదని నయన్ ఆరోపించింది. ధనుష్ తనపై, తన భర్త విఘ్నేష్ శివన్‌పై కొన్నేళ్లుగా పగ పెంచుకుంటున్నాడని ఆమె ఆరోపించింది. చాలా మంది నయనతారకు అనుకూలంగా, మరికొంతమంది వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్‌లు , కామెంట్స్ చేస్తున్నారు.

12 సినిమాలు చేస్తే రెండే హిట్ అయ్యాయి.. కానీ అందంలో అప్సరసే..

ఇదిలా ఉంటే, మమతా మోహన్‌దాస్ పాత ఇంటర్వ్యూ మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకుముందు ఓ ఇంటర్వ్యూలో, రజనీకాంత్ నటించిన సినిమా నుంచి తన పార్ట్‌లను తొలగించారని. తెలిపింది. ఆ సినిమాలో నటించిన స్టార్ హీరోయిన్ తన పార్ట్ ను తీసేసింది అని మమత తెలిపింది. దాంతో ఈ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. చాలా మంది నెటిజన్స్ నయనతారను ఉద్దేశించి కామెంట్స్ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి :ఇదేందయ్యా ఇది..! ప్రస్తుతం పాన్ ఇండియన్ ఊపేస్తున్న ఈ హీరోగారిని గుర్తుపట్టారా.?

మమతామోహన్ దాస్ మాట్లాడుతూ.. “రజనీ సర్‌ సినిమాలో ఓ పాట చేయాలని నన్ను పిలిచారు. ఈ పాటను 45 రోజుల్లో చిత్రీకరించారు. కానీ అది బయటకు వచ్చేసరికి అందులో నా పార్ట్‌ ఏమీలేదు. ఆ పాటలో మరో నటి నటిస్తుంటే తాను నటించనని ఆ సినిమాలోని హీరోయిన్ చెప్పిందని తర్వాత తెలిసింది. ఎంతో కష్టపడి చేశాను. నా మూడు నాలుగు రోజులు వృధా అయ్యాయి. సినిమా వచ్చినప్పుడు అందులో నా బ్యాక్ షాట్ మాత్రమే ఉంది. పాటలో ఒక చివర మాత్రమే కనిపించాను. అది చూసినప్పుడు చాలా డిజప్పాయింట్‌గా అనిపించింది’’ అని మమత అన్నారు.దాంతో మమత చెప్పింది నయన్ గురించే అని కామెంట్స్ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి : ఇదెక్కడి మాస్ రా మావ..! స్టార్ హీరోయిన్స్ ను బీట్ చేసేలా మహేష్ అన్న కూతురు

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్‌పై పోలీసుల ఉక్కుపాదం..వారికి నోటీసులు
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్‌పై పోలీసుల ఉక్కుపాదం..వారికి నోటీసులు
కేకేఆర్‌లో చేరిన డేంజరస్ ఆల్‌రౌండర్.. ఐపీఎల్ మధ్యలో షడన్ ఎంట్రీ
కేకేఆర్‌లో చేరిన డేంజరస్ ఆల్‌రౌండర్.. ఐపీఎల్ మధ్యలో షడన్ ఎంట్రీ
ఇకపై హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్ తప్పనిసరి.. లేదంటే!
ఇకపై హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్ తప్పనిసరి.. లేదంటే!
క్రెడిట్‌ కార్డులు వాడుతున్నారా? ఆర్బీఐ సంచలన నివేదిక..
క్రెడిట్‌ కార్డులు వాడుతున్నారా? ఆర్బీఐ సంచలన నివేదిక..
జాక్ మూవీ ట్విట్టర్ రివ్యూ..
జాక్ మూవీ ట్విట్టర్ రివ్యూ..
రేపే ఒంటిమిట్ట కోదండరామయ్య కళ్యాణ మహోత్సవం,భక్తులకు తిరుమలలడ్డూలు
రేపే ఒంటిమిట్ట కోదండరామయ్య కళ్యాణ మహోత్సవం,భక్తులకు తిరుమలలడ్డూలు
ఔట్ లేదా నాటౌట్? వివాదంగా మారిన రియాన్ పరాగ్ వికెట్
ఔట్ లేదా నాటౌట్? వివాదంగా మారిన రియాన్ పరాగ్ వికెట్
ఢిల్లీకి షాకింగ్ న్యూస్.. ఆర్‌సీబీతో మ్యాచ్‌కు దూరమైన కేటుగాడు?
ఢిల్లీకి షాకింగ్ న్యూస్.. ఆర్‌సీబీతో మ్యాచ్‌కు దూరమైన కేటుగాడు?
IPL 2025: ఐపీఎల్ 2025లో నంబర్ వన్ బౌలర్‌గా డీఎస్పీ సాబ్..
IPL 2025: ఐపీఎల్ 2025లో నంబర్ వన్ బౌలర్‌గా డీఎస్పీ సాబ్..
ఢిల్లీకి షాకిచ్చిన జీటీ.. ఆర్ఆర్ ఓటమితో పాయింట్ల పట్టికలో మార్పు
ఢిల్లీకి షాకిచ్చిన జీటీ.. ఆర్ఆర్ ఓటమితో పాయింట్ల పట్టికలో మార్పు