AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mangalavaram: మరో ఇంట్రెస్టింగ్ మూవీతో రానున్న ఆర్ఎక్స్ 100 డైరెక్టర్.. మంగళవారం నుంచి పాయల్ లుక్

ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి గునుపాటి, సురేష్ వర్మ .ఎం, 'A' క్రియేటివ్ వర్క్స్ పతాకంపై అజయ్ భూపతి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో నటిస్తోంది.  సినిమాలో ఆమె ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

Mangalavaram: మరో ఇంట్రెస్టింగ్ మూవీతో రానున్న ఆర్ఎక్స్ 100 డైరెక్టర్.. మంగళవారం నుంచి పాయల్ లుక్
Mangalavaram
Rajeev Rayala
|

Updated on: Apr 25, 2023 | 1:29 PM

Share

అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మంగళవారం’. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ ఇది. ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి గునుపాటి, సురేష్ వర్మ .ఎం, ‘A’ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై అజయ్ భూపతి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో నటిస్తోంది.  సినిమాలో ఆమె ఫస్ట్ లుక్ విడుదల చేశారు.  ‘ఆర్ఎక్స్ 100’తో అజయ్ భూపతి దర్శకుడిగా పరిచయం అయ్యారు. హీరోయిన్ గా తెలుగులో పాయల్ రాజ్‌పుత్ తొలి చిత్రమది. ఆ సినిమా తర్వాత అజయ్ భూపతి, పాయల్ రాజ్‌పుత్ కలయికలో వస్తున్న చిత్రమిది.

‘మంగళవారం’ సినిమాలో శైలజ పాత్రలో పాయల్ రాజ్‌పుత్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు నేడు. ఆ లుక్ చూస్తే… పాయల్ కళ్ళల్లో కన్నీటి పొర కనబడుతోంది. ఆమె వేలిపై సీతాకోక చిలుక ఉంది. జడలో మల్లెపూలు ఉన్నాయి. అయితే, ఒంటి మీద ఒక్క నూలుపోగు కూడా లేదు. వెనుక నుంచి ఫోటో తీశారు. ఇదొక ఎమోషనల్ అండ్ బోల్డ్ లుక్ అని చెప్పవచ్చు.

ఇవి కూడా చదవండి

ఈ సందర్భంగా దర్శకుడు అజయ్ భూపతి మాట్లాడుతూ ”గ్రామీణ నేపథ్యంలో 1990వ దశకంలో సాగే కథతో తీస్తున్న చిత్రమిది. మన నేటివిటీతో కూడిన డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్. రా అండ్ రస్టిక్ గా ఉంటుంది. థియేటర్ల నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ప్రేక్షకులకు గుర్తు ఉండేలా పాయల్ క్యారెక్టరైజేషన్ ఉంటుంది. ఇప్పటి వరకు ఇండియాలో ఎవరూ ప్రయత్నించనటువంటి కొత్త జానర్ సినిమా. సినిమాలో 30 పాత్రలు ఉన్నాయి. ప్రతి పాత్రకూ కథలో ప్రాముఖ్యం ఉంటుంది” అని అన్నారు.