Major: అడివిశేష్ `మేజ‌ర్`నుంచి ఫ‌స్ట్ గ్లిమ్స్… ఆకట్టుకుంటున్నశోభితా ధూళిపాల లుక్

Rajeev Rayala

Rajeev Rayala |

Updated on: Apr 10, 2021 | 3:56 PM

సాయి మంజ్రేకర్ క్యారెక్టర్ పోస్టర్‌తో మేజ‌ర్ సందీప్ ఉన్నికృష్ణన్ యొక్క హైస్కూల్ రొమాన్స్ లోకి ఒక స్నీక్ పీక్ ఇచ్చిన తరువాత ఆ అమరవీరుడి జీవితంలోని మరో ముఖ్య‌భాగాన్ని ఆవిష్కరించారు నిర్మాత‌లు.

Major: అడివిశేష్ `మేజ‌ర్`నుంచి ఫ‌స్ట్ గ్లిమ్స్... ఆకట్టుకుంటున్నశోభితా ధూళిపాల లుక్
Major
Follow us

Major: సాయి మంజ్రేకర్ క్యారెక్టర్ పోస్టర్‌తో మేజ‌ర్ సందీప్ ఉన్నికృష్ణన్ యొక్క హైస్కూల్ రొమాన్స్ లోకి ఒక స్నీక్ పీక్ ఇచ్చిన తరువాత ఆ అమరవీరుడి జీవితంలోని మరో ముఖ్య‌భాగాన్ని ఆవిష్కరించారు నిర్మాత‌లు. 26/11 ముంబై దాడుల్లో చిక్కుకున్న బందీ పాత్రలో శోభితా ధూళిపాల యొక్క ఫ‌స్ట్ గిమ్స్‌ని విడుద‌ల‌చేశారు. మొత్తం దేశాన్ని భయభ్రాంతులకు గురిచేసి ప్రపంచవ్యాప్తంగా గణనీయమైన ప్రభావాన్ని చూపిన విపత్తు సంఘటన కారణంగా శోభితా ధూళిపాల ఎదుర్కొన్న వేదనను ఈ పోస్టర్లో చూపించారు.

26/11 దురదృష్టకర ఉగ్రవాద దాడుల సమయంలో హోటల్ తాజ్ వద్ద చిక్కుకున్న ఎన్ఆర్ఐ బందీ పాత్రలో శోభితా ధూళిపాల నటించారు. ఈ పోస్టర్ ఈ చిత్రం యొక్క అతి ముఖ్యమైన సన్నివేశాలలో ఒకటి అని తెలుస్తోంది. 26/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలను అర్పించిన దివంగత ఆర్మీ ఆఫీసర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా మేజర్ చిత్రం తెరకెక్కుతోంది. శౌర్యం మరియు ధైర్యానికి పేరుగాంచిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ చనిపోయిన విధానం మాత్రమే కాకుండా, అతను జీవించిన విధానం యొక్క ఆత్మను సంగ్రహించి మేజర్ సందీప్ జీవితాన్నిసెల‌బ్రేట్ చేయ‌డ‌మే ఈ చిత్రం యెక్క ముఖ్య ఉద్దేశం. తెలుగు, హిందీ భాషలలో రూపొందుతోన్న ఈ ప్యాన్ ఇండియా చిత్రానికి శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహించారు. శోభితా ధూళిపాల, సాయి మంజ్రేకర్, ప్రకాష్ రాజ్, రేవతి, మురళి శర్మ ముఖ్య పాత్రల్లో నటించారు. మహేష్ బాబు GMB ఎంటర్టైన్మెంట్ మరియు ఏప్ల‌స్ఎస్‌ మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా నిర్మించిన `మేజర్` చిత్రం జులై2 న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌కాబోతుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Veteran actor Karthik : తీవ్ర అనారోగ్యంతో హాస్పటల్ లో చేరిన బహుభాషా నటుడు కార్తీక్

థియేటర్ వద్ద ఘర్షణ… కానిస్టేబుల్ పై కత్తితో దాడి చేసిన పవన్ కళ్యాణ్ అభిమాని..

దేశంలో మళ్లీ విరుచుకుపడుతున్న మహమ్మారి.. ఆంక్షల అమలుతో సినీ రంగానికి కొత్త చిక్కులు..!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Click on your DTH Provider to Add TV9 Telugu