AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adivi Sesh: ముంబయి మారణహోమం.. రియల్‌ హీరోకు నివాళి అర్పించిన మేజర్‌..

2008 నవంబర్‌ 26న ముంబయిలో జరిగిన మారణహోమంతో భారతదేశంతో పాటు యావత్‌ ప్రపంచం వణికిపోయింది. ఈ దాడిలో మొత్తం 164 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉగ్రదాడి జరిగి నాటికి 13 ఏళ్లు.

Adivi Sesh: ముంబయి మారణహోమం.. రియల్‌ హీరోకు నివాళి అర్పించిన మేజర్‌..
Basha Shek
|

Updated on: Nov 26, 2021 | 9:10 PM

Share

2008 నవంబర్‌ 26న ముంబయిలో జరిగిన మారణహోమంతో భారతదేశంతో పాటు యావత్‌ ప్రపంచం వణికిపోయింది. ఈ దాడిలో మొత్తం 164 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉగ్రదాడి జరిగి నాటికి 13 ఏళ్లు. ఈ నేపథ్యంలో వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ దారుణ సంఘటనను గుర్తుచేసుకుంటున్నారు. మారణహోమంలో ప్రాణాలు కోల్పోయిన అమరులకు నివాళి అర్పిస్తున్నారు. ఈ క్రమంలో 26/11 ముంబై దాడులలో ప్రజల ప్రాణాలను కాపాడే ప్రయత్నంలో అమరుడైన సందీప్ ఉన్నికృష్ణన్‌కు హీరో అడవి శేష్ నివాళులు అర్పించారు. సందీప్ ఉన్నికృష్ణన్ ను స్మరించుకుంటూ ఆయన తల్లిదండ్రులు కె ఉన్నికృష్ణన్, ధనలక్ష్మి ఉన్నికృష్ణన్ ముంబయిలో ఏర్పాటుచేసిన ఓ సమావేశానికి అతను కూడా హాజరయ్యాడు. ఈ సందర్భంగా రియల్‌ హీరోకు నివాళులు అర్పించారు.

కాగా సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో ‘మేజర్’ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మేజర్‌ సందీప్‌ పాత్రను అడవి శేష్ పోషిస్తున్నాడు. బాలీవుడ్ యంగ్ హీరోయిన్ సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. తెలుగమ్మాయి శోభితా ధూళిపాళ, ప్రకాష్ రాజ్, రేవతి, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రిన్స్‌ మహేశ్‌బాబు నిర్మాణ బాధ్యతలు నిర్వహిస్తుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పాన్‌ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, మలయాళం భాషల్లో  ఈ సినిమా తెరకెక్కుతోంది. 2022 ఫిబ్రవరి 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

View this post on Instagram

A post shared by Sesh Adivi (@adivisesh)

Also Read:

Rajashekar’s Shekar : రాజ’శేఖర్’ హిట్ కొడతారా.. జీవితా రాజశేఖర్ ఏమంటున్నారంటే..

Shiva Shankar Master: శివ శంకర్ మాస్టర్ కుటుంబానికి మెగాస్టార్ సాయం.. నేనున్నానంటూ అభయమించిన చిరు..

Bigg Boss 5 Telugu: బీఎమ్‌డబ్ల్యూ కొన్న బిగ్‌బాస్‌ కంటెస్టంట్‌.. కల నెరవేరిందంటూ..