AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajashekar’s Shekar : రాజ’శేఖర్’ హిట్ కొడతారా.. జీవితా రాజశేఖర్ ఏమంటున్నారంటే..

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా 'శేఖర్'. హీరోగా ఆయన 91వ చిత్రమిది. ఈ సినిమాకు జీవితా రాజశేఖర్ దర్శకురాలు.

Rajashekar's Shekar : రాజ'శేఖర్' హిట్ కొడతారా.. జీవితా రాజశేఖర్ ఏమంటున్నారంటే..
Shekar
Rajeev Rayala
|

Updated on: Nov 26, 2021 | 6:19 PM

Share

Rajashekar’s Shekar : యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా ‘శేఖర్’. హీరోగా ఆయన 91వ చిత్రమిది. ఈ సినిమాకు జీవితా రాజశేఖర్ దర్శకురాలు. స్క్రీన్ ప్లే కూడా ఆమె సమకూర్చారు. పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ పతాకాలపై బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మిస్తున్నారు. గురువారం (నవంబర్ 25న) ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ విడుదల చేశారు. అరకు బోసు గూడెం తోట బంగ్లాలో నూతన దంపతులు దారుణ హత్యకు గురయ్యారని ఓ మహిళ చెప్పే వాయిస్ ఓవ‌ర్‌తో ఫ‌స్ట్ గ్లింప్స్‌ మొదలైంది. ఘటనా స్థలానికి పోలీసులు వెంటనే చేరుకున్నా… ఇన్వెస్టిగేషన్ చేయరు. కొన్ని రోజుల క్రితం రిజైన్ చేసిన శేఖర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ‘శేఖర్’గా రాజశేఖర్‌ను ఇంట్రడ్యూస్ చేశారు. ‘వాడు ఎప్పుడైనా మనం చెప్పింది చేశాడా? వాడు చేసేది మనకు చెప్పాడా?’ అని బ్యాక్‌గ్రౌండ్‌లో డైలాగులు వినిపిస్తూ ఉంటే… స్ట‌యిలిష్‌గా సిగ‌రెట్ వెలిగిస్తూ రాజశేఖర్ స్క్రీన్ మీద కనిపించారు. సాల్ట్ అండ్ పెప్ప‌ర్ లుక్‌లో రాజశేఖర్ ఆహార్యం ఆయన గత సినిమాలకు భిన్నంగా ఉంది. ఈ సినిమాతో రాజశేఖర్ మరో హిట్ తన ఖాతాలో వేసుకోవడం ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు.

ఈ సందర్భంగా జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ “ఆల్రెడీ విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించాయి. ఇప్పుడు ఫ‌స్ట్ గ్లింప్స్‌కు ఫెంటాస్టిక్ రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. జనవరి 2022లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం” అని అన్నారు. రాజశేఖర్, ఆత్మీయ రజన్, జార్జ్ రెడ్డి ఫేమ్ ముస్కాన్, అభినవ్ గోమఠం, కన్నడ కిషోర్, సమీర్, తనికెళ్ళ భరణి, రవి వర్మ, శ్రవణ్ రాఘవేంద్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం అనూప్ రూబెన్స్ అందిస్తున్నారు. ఇక శేఖర్ ఫస్ట్ గ్లిమ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇప్పటివరకు ఈ గ్లిమ్స్ కు 1.4 మిలియన్ వ్యూస్ దక్కించుకుంది. త్వరలోనే ఈ సినిమానుంచి టీజర్ ను విడుదల చేసే అవకాశం ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

RRR Janani Song : ఆర్ఆర్ఆర్ నుంచి జనని సాంగ్ వచ్చేసింది.. సినిమా మొత్తానికి సోల్ ఈ పాట..

Keerthy Suresh: చీరకట్టులో మెరిసిపోతున్న నేటి ‘మహానటి’.. ‘కీర్తీసురేష్’ లేటెస్ట్ ఫోటోస్..

Ritu Varma: తెలుగు అమ్మాయి రీతూ వర్మ అందాలు.. చందమామ అయినా చిన్నబోవాల్సిందే..(ఫొటోస్)

Follow Us
5వ మ్యాచ్‌లో ఓడిన భారత్.. 3-2తేడాతో సిరీస్ గెలిచిన శ్రేయాస్ సేన
5వ మ్యాచ్‌లో ఓడిన భారత్.. 3-2తేడాతో సిరీస్ గెలిచిన శ్రేయాస్ సేన
బ్యాలెట్ పేపర్లలో కనిపించని సైకిల్, కమలం గుర్తు..!
బ్యాలెట్ పేపర్లలో కనిపించని సైకిల్, కమలం గుర్తు..!
ఇంట్లోని డీప్ క్లీనింగ్‌లో లైట్ బల్బులను ఎలా శుభ్రం చేయాలి? ఈజీగా
ఇంట్లోని డీప్ క్లీనింగ్‌లో లైట్ బల్బులను ఎలా శుభ్రం చేయాలి? ఈజీగా
తొలి బుల్లెట్‌ రైలు.. తొలిసారి అరుదైన దృశ్యాలు షేర్ చేసిన మంత్రి
తొలి బుల్లెట్‌ రైలు.. తొలిసారి అరుదైన దృశ్యాలు షేర్ చేసిన మంత్రి
మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయని మాజీ సీఎం జగన్
మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయని మాజీ సీఎం జగన్
ఏపీకి మరో ముప్పు.. అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
ఏపీకి మరో ముప్పు.. అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
ఓటీటీలో మరో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలో మరో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
అమెరికా కళ్లుగప్పి రహస్య నెట్‌వర్క్ నుంచి ఆయుధాలు కొంటున్న ఇరాన్
అమెరికా కళ్లుగప్పి రహస్య నెట్‌వర్క్ నుంచి ఆయుధాలు కొంటున్న ఇరాన్
తీరానికి అకస్మాత్తుగా అరుదైన తాబేళ్లు...160కి. మీ మేర లాక్‌డౌన్!
తీరానికి అకస్మాత్తుగా అరుదైన తాబేళ్లు...160కి. మీ మేర లాక్‌డౌన్!
10 రోజుల్లో బంగారం, వెండి ఎంత తగ్గిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
10 రోజుల్లో బంగారం, వెండి ఎంత తగ్గిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!