Shiva Shankar Master: శివ శంకర్ మాస్టర్ కుటుంబానికి మెగాస్టార్ సాయం.. నేనున్నానంటూ అభయమించిన చిరు..

ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ కరోనా భారిన పడిన విషయం తెలిసిందే.. కరోనా ఎఫెక్ట్ కావడంతో శివశంకర్ మాస్టర్ ఆరోగ్య పరిస్థితి విషమించింది.

Shiva Shankar Master: శివ శంకర్ మాస్టర్ కుటుంబానికి మెగాస్టార్ సాయం.. నేనున్నానంటూ అభయమించిన చిరు..
Chiranjeevi
Follow us

|

Updated on: Nov 26, 2021 | 7:05 PM

Shiva Shankar Master: ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ కరోనా భారిన పడిన విషయం తెలిసిందే.. కరోనా ఎఫెక్ట్ కావడంతో శివశంకర్ మాస్టర్ ఆరోగ్య పరిస్థితి విషమించింది. శివశంకర్ మాస్టర్ ఊపిరితిత్తులకు ఇన్ ఫెక్షన్ సోకిందని..75శాతం ఇనెఫెక్షన్ ఉండడంతో ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. దాంతో ఆయనకు సాయం అందించేందుకు నటీనటులు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే సోనూసూద్, కోలీవుడ్ హీరో ధనుష్ శివ శంకర్ మాస్టర్ కు ఆర్థికసాయం అందిస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి  ముందుకు వచ్చారు. శివ శంకర్ మాస్టర్ గచ్చిబౌలిలోని ఏ ఐ జి హాస్పిటల్ లో క్రిటికల్ కేర్ లో వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్నారు.. దురదృష్టవశాత్తు ఆయన భార్యకి కూడా కరోనా సోకడంతో ఆమె ఇంట్లోనే హోమ్ కవారెంటైన్ లో ఉంటున్నారు. శివ శంకర్ మాస్టర్ పెద్ద కుమారుడికి కూడా కరోనా సోకడంతో ఆయన కూడా వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్నారు. ఈ కుటుంబానికి చికిత్స కోసం రోజుకు లక్ష రూపాయలు ఖర్చు అవుతుండడంతో శివ శంకర్ మాస్టర్ చిన్న కుమారుడు అజయ్ తనకు సహాయం అందించవలసిందిగా సినీ పెద్దలను కోరారు.

విషయం తెలిసిన వెంటనే చిరంజీవి హుటాహుటిన అజయ్ కి ఫోన్ చేసి ఇంటికి పిలిపించుకున్నారు. తక్షణ సాయంగా మూడు లక్షల రూపాయల చెక్కుని మెగాస్టార్ చిరంజీవి శివ శంకర్ మాస్టర్ కుటుంబానికి అందజేశారు. అంతేకాక వైద్యానికి సంబంధించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. శివ శంకర్ మాస్టర్ కు మేమంతా ఉన్నాం అని అభయమిచ్చారు. చిరంజీవిని కలిసి చెక్ తీసుకున్న తర్వాత అజయ్ మాట్లాడుతూ “నాన్న గారికి అనారోగ్యం అనే సంగతి తెలిసిన వెంటనే చిరంజీవి గారు ఫోన్ చేసి పిలిపించారని, తక్షణ సాయంగా మూడు లక్షల రూపాయల చెక్కును అందించారు అని వెల్లడించారు. చిరంజీవి గారు అంటే నాన్న గారికి ఎంతో అభిమానం అని పేర్కొన్న అజయ్.. చిరంజీవి గారితో సినిమాలు నాన్న గారు కలిసి చేశారని వెల్లడించారు. ఇటీవల ఆచార్య షూటింగులో కూడా నాన్నగారు చిరంజీవిని కలిశారని అజయ్ గుర్తుచేసుకున్నారు. ఇలాంటి సమయంలో ప్రతి రూపాయి తనకి చాలా అవసరం అని పేర్కొన్న అజయ్ చిరంజీవి గారు చేసిన సాయం ఎన్నటికీ మరువలేని ఆయనకి ఎన్నటికీ రుణపడి ఉంటానని ” అన్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bigg Boss 5 Telugu: బీఎమ్‌డబ్ల్యూ కొన్న బిగ్‌బాస్‌ కంటెస్టంట్‌.. కల నెరవేరిందంటూ..

RRR Janani Song : ఆర్ఆర్ఆర్ నుంచి జనని సాంగ్ వచ్చేసింది.. సినిమా మొత్తానికి సోల్ ఈ పాట..

Keerthy Suresh: చీరకట్టులో మెరిసిపోతున్న నేటి ‘మహానటి’.. ‘కీర్తీసురేష్’ లేటెస్ట్ ఫోటోస్..

బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి