Sitara Ghattamaneni: పట్టుబట్టల్లో బుట్టబొమ్మలా ముస్తాబైన మహేష్ గారాల పట్టి

తండ్రి మహేష్ పాటలకు డాన్స్ లు చేస్తూ ఆకట్టుకుంటుంది సితార. అలాగే మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమాలో లిరికల్ సాంగ్ లో కనిపించి అలరించింది. ఇక ఈ చిన్నది సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

Sitara Ghattamaneni: పట్టుబట్టల్లో బుట్టబొమ్మలా ముస్తాబైన మహేష్ గారాల పట్టి
Sithara
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 22, 2023 | 3:40 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ చిన్నారి చాలా టాలెంటెడ్. తండ్రి మహేష్ పాటలకు డాన్స్ లు చేస్తూ ఆకట్టుకుంటుంది సితార. అలాగే మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమాలో లిరికల్ సాంగ్ లో కనిపించి అలరించింది. ఇక ఈ చిన్నది సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం రకరకాల ఫోటోలు, వీడియోలతో ఆకట్టుకుంటుంది సితార. సితారకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను నమ్రత అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా తెలుగు సంవతస్సరాది ఉగాదిని పురస్కరించుకుని సితార పట్టుబట్టల్లో బుట్టబొమ్మలా ముస్తాబైంది.

సితార కుందనపు బొమ్మ లా ముస్తాబైన ఫోటోను షేర్ చేసి మురిసిపోయారు నమ్రత. అభిమానులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. సితార ఉగాది వేడుక ఫొటోలు, వీడియో వైరల్ అవుతున్నాయి. సితార ఫొటోలు చూసిన అభిమానులు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

ఈ వీడియెకి బ్యాక్ గ్రౌండ్ లో ‘సీతమ్మ వాకిట్లో సిరమల్లె చెట్టు’ సినిమాలోని మెలోడీ సాంగ్ ప్లే అవుతుంది. ప్రస్తుతం ఈవీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.