Mahesh Babu: సూపర్ స్టార్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. కౌండౌన్‌తో కాక రేపుతోన్న SSMB 28..
సర్కారు వారి పాట తర్వాత.. చాలా గ్యాప్ తీసుకున్న సూపర్ స్టార్ మహేష్ ఎట్ ప్రజెంట్ త్రివిక్రమ్ డైరెక్షన్లో SSMB28 వర్కింగ్ టైటిల్‌తో.. సినిమా షూట్‌ను పరిగెత్తిస్తున్నారు. ఓ పక్క వెకేషన్స్ అంటూ.. ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూనే... మరో పక్క ఈ సినిమాకు సంబంధించిన పనులను చాలా ఫాస్ట్ గానే ఫినిష్ చేస్తున్నారు.

సూపర్ స్టార్ మహేష్ కాదు.. ఆయన్ను డైరెక్ట్ చేస్తున్న మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కూడా కాదు.. మరి ఎవరు కన్ఫూజన్ అవుతున్నారు? సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్సే కన్ఫూజ్ అవుతున్నారు. ఎందుకంటారా? అయితే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ!
సర్కారు వారి పాట తర్వాత.. చాలా గ్యాప్ తీసుకున్న సూపర్ స్టార్ మహేష్ ఎట్ ప్రజెంట్ త్రివిక్రమ్ డైరెక్షన్లో SSMB28 వర్కింగ్ టైటిల్‌తో.. సినిమా షూట్‌ను పరిగెత్తిస్తున్నారు. ఓ పక్క వెకేషన్స్ అంటూ.. ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూనే… మరో పక్క ఈ సినిమాకు సంబంధించిన పనులను చాలా ఫాస్ట్ గానే ఫినిష్ చేస్తున్నారు. ఇక ఈకమ్రంలోనే ఈ మూవీకి టైటిల్స్ ఇవే అంటూ.. ఇండస్ట్రీ నుంచి బయటికి వచ్చిన టైటిల్స్ ఇప్పుడు మహేష్ ఫ్యాన్స్ ను తెగ కన్ఫూజ్ చేస్తున్నాయి.
గుంటూరు కారం, అమరావతికి అటు ఇటు, ఊరికి మొనగాడు అనే మూడు టైటిల్స్ త్రివిక్రమ్ మహేష్ సినిమా టైటిల్స్‌లో ఒకటనే న్యూస్ ఇండస్ట్రీ నుంచి బయటికి వచ్చి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండడంతో.. మహేష్ ఫ్యాన్స్ అయోమయంలో పడుతున్నారు. ఏ టైటిల్ ఫైనల్ అవుతుందో తేల్చుకోలేక జుట్టుపీక్కుంటున్నారు. మరో పక్క సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా SSMB28 టైటిల్ అనౌన్స్ మెంట్ ఉందని తెలిసినా.. మేకర్స్ చెబుతున్నా..! వినకుండా.. టైటిల్‌పై పోల్స్ పెడుతూ ఆరా తీస్తున్నారు. SSMB28 టైటిల్‌పై చిన్న పాటి డిబెట్ రన్ అయ్యేలా చేస్తున్నారు. తాజాగా ఫ్యాన్స్ లో ఆసక్తి పెంచేందుకు మరో ప్రీ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సారి మహేష్ బ్యాక్ సైడ్ ఫోటోను షేర్ చేశారు.
#SSMB28MassStrike on 31st May! ???️ #SSMB28 pic.twitter.com/2Ft3tyCADK
— Haarika & Hassine Creations (@haarikahassine) May 27, 2023




