Sarkaru Vaari Paata: క్లైమాక్స్‌లో మహేష్ సర్కారు వారి పాట.. ప్రమోషన్స్ ప్లాన్ చేసుకుంటున్న మేకర్స్..
సూపర్ స్టార్ మహేష్ బాబు స్పీడ్ పెంచారు. తగ్గేదే లే అంటూ జెట్ స్పీడ్ తో సర్కారు వారి పాట సినిమాను జనాల్లోకి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు మహేష్.
సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) స్పీడ్ పెంచారు. తగ్గేదే లే అంటూ జెట్ స్పీడ్ తో సర్కారు వారి పాట(Sarkaru Vaari Paata) సినిమాను జనాల్లోకి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు మహేష్. పరశురామ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ భారీ చిత్రానికి సంబధించిన ప్రతి అప్డేట్ ప్రేక్షకులని అలరిస్తుంది. సెన్సేషనల్ సంగీత దర్శకుడు ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన రెండు పాటలు చార్ట్ బస్టర్స్ గా రికార్డులు సృష్టించాయి. మొదటి పాటగా విడుదలైన ‘కళావతి’ మళ్ళీ మళ్ళీ పాడుకునే పాటగా నిలిచి రికార్డ్ వ్యూస్ ని సొంతం చేసుకొని మ్యూజికల్ ప్రమోషన్స్ కు అదిరిపోయే ఆరంభాన్ని ఇవ్వగా, సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె ప్రిన్సెస్ సితార ఘట్టమనేని గెస్ట్ అప్పియరెన్స్ తో వచ్చిన రెండో పాట ‘పెన్ని’ సాంగ్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఈసినిమానుంచి థర్డ్ సాంగ్ కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగాఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా సాంగ్ అప్డేట్ ఎప్పుడు అంటూ మేకర్స్ ని ప్రశ్నిస్తున్నారు. సర్కారు వారి పాట సినిమాను మే 12న విడుదల చేయనున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచాలని చూస్తున్నారు మేకర్స్. మొత్తానికి సినిమా షూటింగ్ క్లైమాక్స్ కు చేరుకుందని సమాచారం . దాంతో మరో వారం రోజుల్లోనే ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలు పెట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలాగే ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా గ్రాండ్ గా జరపాలని ప్లాన్ చేస్తున్నారట. కీర్తి సురేష్ ఈ సినిమాలో మహేష్ కు జోడీగా నటించిన విషయం తెల్సిందే.
మరిన్ని ఇక్కడ చదవండి: