AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Eesha Rebba : ఆ క్రేజీ హీరోతో నా సినిమా ఆగిపోయింది.. ఆసక్తికర విషయం తెలిపిన తెలుగమ్మాయి

టాలీవుడ్ రాణిస్తున్న భామతో తెలుగు ముద్దుగుమ్మలు తక్కువనే చెప్పాలి. వీరిలో అందాల భామ ఈషా రెబ్బ ఒకరు. అంతకు ముందు ఆ తర్వాత సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ.

Eesha Rebba : ఆ క్రేజీ హీరోతో నా సినిమా ఆగిపోయింది.. ఆసక్తికర విషయం తెలిపిన తెలుగమ్మాయి
Eesha Rebba
Rajeev Rayala
|

Updated on: Apr 17, 2022 | 4:26 PM

Share

టాలీవుడ్ రాణిస్తున్న భామతో తెలుగు ముద్దుగుమ్మలు తక్కువనే చెప్పాలి. వీరిలో అందాల భామ ఈషా రెబ్బ(Eesha Rebba )ఒకరు. అంతకు ముందు ఆ తర్వాత సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ. ఆతర్వాత వరుసగా పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ఈషా రెబ్బా ఆ తరువాత ‘అరవింద సమేత’ సినిమాలో హీరోయిన్ సిస్టర్ క్యారెక్టర్ లో మెరిసి ఆకట్టుకుంది. రీసెంట్ గా రాగల 24 గంటల్లో అనే సినిమాతో హిట్ అందుకుంది. ఇక ఈ అమ్మడు ప్రస్తుతం వెబ్ సిరీస్ లతో బిజీగా గడుపుతుంది. ఇటీవలే ఆహా కోసం ఓ బోల్డ్ వెబ్ సిరీస్ లో నటించింది. 3 రోజెస్ అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ సిరీస్ లో హాట్ గా నటించి ఆకట్టుకుంది ఈ బ్యూటీ. తాజాగా ఈ అమ్మడు ఓ ఇంట్రవ్యూలో మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాలను పంచుకుంది.

ఈషా మాట్లాడుతూ..  ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో మూడు సినిమాల్లో నటించాను. ఆయన సినిమాలలో చేసే అవకాశం రావడం నా అదృష్టం.. వాటిలో అమితుమీ సినిమా అంటే నాకు చాలా ఇష్టం అంటూ చెప్పుకొచ్చింది. ఈ మధ్య ఆయనతో చేయడం కుదరలేదు. నాకు తగిన పాత్ర .. వేస్తే ఆయన నాకు తప్పకుండ చెప్తారు. మరోసారి ఆయన సినిమాలో నటించడానికి ఎదురుచూస్తున్నా అని తెలిపింది ఈషా. అయితే నేను చేయాల్సిన సినిమాలు ఆగిపోయినవి కూడా కొన్ని ఉన్నాయి. నాగశౌర్యతో ఒక సినిమా చేయవలసింది. ఏమైందో ఏమో కానీ ఆసినిమా ఆగిపోయింది. అనుకున్నవన్నీ జరగవు.. వాటిని గురించి ఆలోచిస్తూ కూర్చోకుండా వచ్చిన అవకాశాలతో ముందుకు వెళ్లిపోవడమే అని తెలిపింది. ఇక పెళ్లి గురించి మాట్లాడుతూ.. పెళ్లి ఎప్పుడు?  అని అడుగుతారు. ‘అప్పుడే కంగారు ఏవుంది? అని చెప్తుంటాను. తెలుగులో సినిమాలు చేస్తుంది.. అలాగే ఈ అమ్మడి తమిళ్ , మలయాళం నుంచి ఆఫర్లు కూడా వస్తున్నాయి.

మరిన్ని ఇక్కడ చదవండి: 

Viral Photo: ఇతను కళ్లతో మాయ చేస్తాడు.. మాటలతో బూరెలు వండేస్తాడు… ఎవరో గుర్తించారా..?

Soundarya Death Anniversary: చెక్కుచెదరని చిరునవ్వు.. చూడగానే ఆకట్టుకునే నిలువెత్తు రూపం.. నేడు సౌందర్య వర్థంతి

Acharya: మెగాస్టార్‌ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు డేట్‌ ఫిక్స్‌.. ముఖ్య అతిథిగా ఎవరు రానున్నారంటే!