AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu : వారణాసి కోసం ఇంత కష్టమా.. ? బ్లాక్ ఫారెస్ట్‏లో మహేష్ బాబు ట్రెక్కింగ్ శిక్షణ..

పాన్ ఇండియా లెవల్లో మోస్ట్ అవైటెడ్ సినిమా అంటే ఠక్కున గుర్తొ్చ్చే పేరు వారణాసి. మొదటి నుంచి ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ట్రిపుల్ ఆర్ తర్వాత డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది.

Mahesh Babu : వారణాసి కోసం ఇంత కష్టమా.. ? బ్లాక్ ఫారెస్ట్‏లో మహేష్ బాబు ట్రెక్కింగ్ శిక్షణ..
Mahesh Babu
Rajitha Chanti
|

Updated on: May 03, 2026 | 10:03 AM

Share

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్న సినిమా వారణాసి. ఈ మూవీ కోసం పాన్ ఇండియా అడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్ కొన్ని నెలలుగా షూటింగ్ జరుగుతుంది. ఇటీవలే కీలక షెడ్యూల్ పూర్తి చేసుకోగా.. ఆ వెంటనే మహేష్ జర్మనీకి వెళ్లి పోయిన సంగతి తెలిసిందే. దీంతో ఎప్పటిలాగే మహేష్ వెకేషన్ కోసం వెళ్లారని అంతా భావించారు. కానీ తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. తాజాగా ఆయన సోషల్ మీడియాలో పంచుకున్న ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. ప్రస్తుతం తాను వారణాసి కోసం ప్రత్యేక శిక్షణ తీసుకునేందుకు అక్కడికి వెళ్లినట్లు తెలుస్తోంది. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం మహేష్ ఇప్పుడు జర్మనీలోని బ్లాక్ ఫారెస్ట్ లో ఉన్నారు. అక్కడ ఆయన ఫిట్నెస్, వెల్ నెస్ నిపుణులు డాక్టర్ హ్యారీ కోనిగ్ పర్యవేక్షణలో ట్రెక్కింగ్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Sekhar Kammula : ఆ సినిమా తీసి తప్పు చేశాను.. అది ఒక పొరపాటు మాత్రమే.. డైరెక్టర్ శేఖర్ కమ్ముల కామెంట్స్..

ప్రస్తుతం మహేష్ ఫోటోస్ నెట్టింట వైరల్ గా మారాయి. ప్రపంచంతోపాటు కాలాన్ని చుట్టేసే సాహసికుడి కథతో ఎపిక్ యాక్షన్ అడ్వెంచర్ సినిమాగా వారణాసి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో ట్రెక్కింగ్ తో కూడిన యాక్షన్ సీన్స్ సైతం ఉండనున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇప్పుడు మహేష్ ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నట్లు అర్థమవుతుంది. ఇటీవల విడుదలైన మహేష్ ఫస్ట్ లుక్ గ్లింప్స్ మరింత హైప్ క్రియేట్ చేసుకుంది. ఈమూవీలో ఇందులో రుద్రగా, శ్రీరాముడిగా కనిపించనున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Gopichand : జయం సినిమాకు నాకు ఇచ్చిన రెమ్యునరేషన్ అంతే.. ఎలా ఖర్చు చేశానంటే.. గోపిచంద్ కామెంట్స్..

ఈ చిత్రం కొత్త షెడ్యూల్ తిరిగి జూన్ లో మొదలయ్యే అవకాశం ఉంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా మందాకిని పాత్రలో నటిస్తుంది. అలాగే మలయాళీ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

ఎక్కువ మంది చదివినవి :  Tollywood : రూ.5 వేలకు స్కూల్లో టీచర్.. ఇప్పుడు ఒక్కో సినిమాకు కోట్లలో రెమ్యునరేషన్.. పాన్ ఇండియా గ్లామరస్ హీరోయిన్..

ఎక్కువ మంది చదివినవి : Krishna Vamsi : రమ్య కృష్ణతో ప్రేమ, పెళ్లికి ఆ పాటనే కారణం.. డైరెక్టర్ కృష్ణ వంశీ..

Follow Us