Mahesh Babu : బాలీవుడ్ పై మహేష్ బాబు కామెంట్స్ వైరల్.. ఆర్జీవీ రియాక్షన్ ఏంటంటే

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట(Sarkaru Vaari Paata)రిలీజ్ మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. సర్కారు వారి పాట పాజిటివ్ రెస్పాన్స్ తో ప్రజెంట్ ట్రెండ్ అవుతోంది.

Mahesh Babu : బాలీవుడ్ పై మహేష్ బాబు కామెంట్స్ వైరల్.. ఆర్జీవీ రియాక్షన్ ఏంటంటే
Mahesh Babu Rgv
Follow us
Rajeev Rayala

|

Updated on: May 11, 2022 | 7:25 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu)నటిస్తున్న సర్కారు వారి పాట(Sarkaru Vaari Paata)రిలీజ్ మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. సర్కారు వారి పాట పాజిటివ్ రెస్పాన్స్‌తో ప్రజెంట్ ట్రెండ్ అవుతోంది. మహేష్ డైలాగులు మాసీ రియాక్షన్‌ను రాబడుతున్నాయి. తమన్ సాంగ్స్ ఎక్కడ విన్నా రీసౌండ్ చేస్తున్నారు. సినిమా పై విపరీతమైన ఎక్స్‌ పెక్టేషన్స్ ను పెంచేస్తున్నాయి. `భరత్ అనే నేను`..`మహర్షి`.. `సరిలేరు నీకెవ్వరు`తో బ్లాక్ బస్టర్ అందుకుని దూసుకుపోతున్నారు మహేష్. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ అయితే అంచనాలను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లింది. సర్కారు వారి పాట సినిమాతో మహేష్ మరో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకోవడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్.

ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీ అయ్యారు చిత్రయూనిట్. ఇప్పటికే వరుస ఇంట్రవ్యూలతో దర్శకుడు పరశురామ్, సంగీత దర్శకుడు తమన్ అలాగే మహేష్ బాబు బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇదిలా ఉంటే మహేష్ బాబు చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఇంటర్వ్యూలో బాలీవుడ్‌పై మహేశ్‌ చేసిన కామెంట్స్‌ హాట్ టాపిక్ గా మారాయి. బాలీవుడ్‌ ఎంట్రీపై స్పందిస్తూ.. బాలీవుడ్‌ తనని భరించలేదని.. అందుకే తాను అక్కడికి వెళ్లి టైమ్ వేస్ట్ చేసుకోవాలనుకోవడం లేదని.. టాలీవుడ్‌లో ప్రేక్షకుల అభిమానం పొందడం ఆనందంగా ఉందని మహేష్ అన్నారు. నాకు సినిమా అంటే ప్రేమ, అన్ని భాషలపై గౌరవం ఉంది. తెలుగులో నటించడమే నాకిష్టం..అందుకే ఇతర భాషల్లో సినిమాలు చేయను. మన తెలుగు సినిమా జాతీయ స్థాయికి ఎదగడం ఆనందంగా ఉంది అని మహేష్ అన్నారు.దీంతో మహేశ్‌ చేసిన కామెంట్స్ బీటౌన్‌ లో చక్కర్లు కొడుతున్నాయి. మహేష్ చేసిన కామెంట్స్ పై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ఓ ప్రముఖ ఇంగ్లీష్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఆర్జీవీ మాట్లాడుతూ.. మహేష్ వ్యాఖ్యలను సమర్ధించారు. రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ..”హీరోగా అది మహేష్ ఎంపిక. కానీ బాలీవుడ్ అతనిని భరించలేనిదన్న అతని ఉద్దేశ్యం ఏమిటో నాకు అర్ధం కాలేదు. బాలీవుడ్ అంటే ఒక కంపెనీ కాదు.. మీడియా ఇచ్చే లేబుల్.. ఒక్కో సినిమా కంపెనీ లేదా ప్రొడక్షన్ హౌస్ లాంటిది.  మహేష్ ఏ ఉద్దేశ్యంతో ఆ కామెంట్స్ చేశారో నాకు అర్ధం కాలేదు అని అన్నారు ఆర్జీవీ.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Upasana Konidela: ఉపాసన కొణిదెలకు కోవిడ్ పాజిటివ్.. మానసికంగా ధైర్యంగా ఉన్నానంటూ పోస్ట్..

Sarkaru Vaari Paata First Review: సర్కారు వారి పాట ఫస్ట్ రివ్యూ.. స్క్రీన్ పై సింహాంలా గర్జించిన మహేష్..

Viral Photo: పున్నమి వెన్నెల లాంటి నవ్వు.. రెండు జడల గులాబీ చిన్నారి.. కుర్రాళ్ళని తన మాయలో ముంచేసింది.. గుర్తుపట్టండి..

ఇవి కూడా చదవండి

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి